రజనీ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్న మాస్ బీట్‌ సాంగ్

రజనీ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్న మాస్ బీట్‌ సాంగ్

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఏమాత్రం గ్యాప్‌ ఇవ్వకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తు ఫ్యాన్స్‌ని ఖుషి చేస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు కబాలి, కాలా సినిమాలతో ఆకట్టుకున్న రజనీ తాజాగా 2.ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుడడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఫ్యాన్స్‌ని మరింత ఖుషి చేస్తు కార్తీక్ సుబ్బరాజు డెరెక్షన్‌లో చేస్తున్న పెట్టా సినిమా పోస్టర్స్ , మోషన్ పోస్టర్స్ తో అలరిస్తున్నాడు . తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ట్రార్ రిలిజ్ చేశారు…

ట్రైలర్‌ 9న విడుదల

ఈ సినిమాకు అనిరుద్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.. అయితే రజనీకాంత్‌కు అనిరుద్‌ వీరాభిమాని. అందుకు ఫస్ట్ మాస్‌ పాటను ఎంతో ఇష్టంగా సగటు అభిమానికి నచ్చేలా రూపొందించాడు.ఈ మాస్ బీట్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. రెండో పాటను డిసెంబర్ 7న, ట్రైలర్‌ను 9న విడుదల చేయనున్నారు.సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి తాజాగా రిలీజ్ అయిన 2. ఓ తో భారీ హిట్ అందుకున్న రజనీ ఈ పెట్టాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *