నవంబర్ 11న RRR గ్రాండ్ లాంచ్ ...ముఖ్య అతిధులుగా

నవంబర్ 11న RRR గ్రాండ్ లాంచ్ ...ముఖ్య అతిధులుగా

రాజమౌళి మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడని నందమూరి, మెగా అభిమానులు ఆత్రుతగా ఎదిరి చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టడానికి జక్కన్న డేట్ ఫిక్స్ చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాని ఈ నెల 11న ఉదయం 11గంట 11 నిమిషాలకు మొదలు పెట్టాబోతున్నారు..

RRR Launch live

ముఖ్య అతిధులుగా రజినీకాంత్, ప్రభాస్ 

ఈ భారీ సినిమాకి పునాది లాంటి లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయాలనీ జక్కన భావిస్తున్నాడట.. rrr లాంచింగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉండాలని, ముహూర్త సమయం నుంచే ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట.

RRR Laundh event

ఘనంగా ప్లాన్ చేసిన రాజమౌళి

అందుకే ఈ మెగా ఈవెంట్ కి ఇద్దరు గెస్ట్ లని పిలవాలని చూస్తున్నాడట.. ఆ ఇద్దరిలో ఒకరు డార్లింగ్ ప్రభాస్ కాగా మరొకరు ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరైన తలైవా రజినీకాంత్… బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీగా ఉన్న రజినీని ఈ ఈవెంట్ కి పిలిస్తే rrr సినిమాకి తమిళనాట కూడా మంచి మీడియా హైప్ వస్తుంది అలాగే ఇక్కడ రోబో 2.0 సినిమాకి కూడా బాగా ప్రమోషన్ అవుతుంది. అది ముందుగానే ఆలోచించిన రాజమౌళి, rrr లాంచ్ కి రజినీని పిలుస్తున్నట్లు తెలుస్తుంది.

మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న ఈ సినిమా గురించి తన ప్రతి సినిమా లైన్ ని ముందుగానే చెప్పే జక్కన్న, rrr గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ లోనే స్టోరీ లైన్ చెప్పేస్తాడేమో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *