రాజ్ తరుణ్‌కు జోడీగా అదితిరావ్ హైదరి

రాజ్ తరుణ్‌కు జోడీగా అదితిరావ్ హైదరి

ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌. ఫస్ట్ సినిమాతో హిట్ అందుకున్న ఈ హీరో ఆ తరవాత వరసపెట్టి సినిమాలు చేస్తూ వచ్చిన కమర్షియల్ హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు.. రెండు మూడు సినిమాలు బాగా ఆడినా రాజ్ తరుణ్‌ మార్కెట్‌ను మాత్రం పెంచలేకపోయాయి.. పోయినా ఏడాది మూడు సినిమాలు చేశాడు. ఆ మూడు కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ఈ హీరో కెరీర్ కాస్త డైలమాలో పడిపోయింది. ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న ఇద్దరి లోకం ఒకటే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తరువాత వెంటనే మరో సినిమా చేయబోతున్నాడట. ఇందులో హీరోయిన్‌గా ఓ స్టార్ హీరోయిన్ నటించబోతుందని తెలుస్తోంది.

ఇద్దరి లోకం ఒకటే సినిమా తరువాత ఆ వెంటనే గుండెజారి గల్లంతయ్యిందే ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమాలో అదితిరావ్ హైదరిని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న డైరెక్టర్ అదితిరావ్ హైదరి అయితే ఈ కథకు సూటబుల్ అని భావిస్తున్నాడట.అందుకే ఆమెతో సంప్రధింపులు కూడా జరిగాయని తెలుస్తోంది. అయితే పాత్ర కి ప్రాధాన్యత లేనిదే అదితి రావ్ అంత ఈజీగా ఏ సినిమా కూడా ఒప్పుకోదు. అలాంటి ఈ సినిమాలో పాత్రకు తన పాత్రకు ఇంపార్టెంట్ ఉండడంతో 65 లక్షల పారితోషికం తీసుకుని రాజ్ తరుణ్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *