నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం

నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం

rain

మండే ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలు మరికొన్ని రోజులు ఉక్కపోతను భరించాల్సిందే. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 8న ఆలస్యంగా కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీని 11న, తెలంగాణను 13న రుతుపవనాలు తాకే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. దీంతో వరుణుడి రాక కోసం అటు రైతులు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *