ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు

ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు

ఏపీ, తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. అబిడ్స్‌, నాంపల్లి, బషీర్‌బాగ్, నాంపల్లి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ సహా పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి.

మరోవైపు రంగారెడ్డి జిల్లా కుండపోత వర్షం కురసింది. దీంతో ఈసీ నది పొంగిపొర్లింది. దీంతో అక్కడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఏపీలో తూర్పుగోదావరి, కర్నూలు సహా పలు జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరడంతో అక్కడి వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలాఉంటే.. హైదరాబాద్‌ రెండు సెంటిమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిస్తే ఇళ్లలో నుంచి ప్రజలకు బయటకు రావద్దని జీహెచ్‌ఎంసీ కమిషన్‌ దానకిషోర్‌ తెలిపారు. అలాగే గమ్య స్థానాలకు వెళ్లే వారికి ఒకేసారి కాకుండా విడతల వారీగా బయటకు వస్తే ట్రాఫిక్‌కు అంతరాయం కలగదని చెప్పారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *