రాహుల్ గాంధీ మెదక్ నుంచి పోటీ చేస్తారా!?

రాహుల్ గాంధీ మెదక్ నుంచి పోటీ చేస్తారా!?

లోక్‌సభ ఎన్నికలు సమీపించడంతో దేశ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.చాలా సంక్లిష్టంగా మారిన ఎన్నికలు కావడంతో పార్టీలు తమ అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తూ విడతలువారీగా అభ్యర్థులను ఎంపికచేస్తున్నాయి.మరికొన్ని పార్టీలు మాత్రం పొత్తుల గురించి,సీట్ల పంపకాల గురించి చర్చల్లో తలమునకలయ్యాయి. ఇదే క్రమంలో తమ ప్రాంతం నుంచి పోటీచేయాలంటూ రాహుల్ గాంధీని కొన్ని పార్టీలోని ముఖ్యనేతలు విజ్ఞప్తులు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇటువంటి వినతులు ఎక్కువ వస్తున్నాయి. ” సార్..సౌత్ నుంచి పోటీచేయండి అని సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ నేతలు రిక్వెస్ట్ పంపుతున్నారు.

rahul contest from medak

రాహుల్ గాంధీ కర్నాటక నుంచే పోటీచేయాలని మాజీ సీఎం సిద్దరామయ్య, దినేశ్ గుండురావు సహా పలువురు కాంగ్రెస్ నేతలు అభ్యర్థనలు పెడుతున్నారు. #RaGaFromKarnataka పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేస్తున్నారు. కర్నాటక నుంచి పోటీచేసిన నేత ప్రధాన మంత్రి అయితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలకు కర్నాటక ఎంతో మద్దతు, ప్రోత్సాహం ఇచ్చింది, ప్రజలు ఎంతో గొప్పగా ఆదరిస్తారు..ఇందిరాగాంధీ, సోనియా గాంధీల వల్ల అది రుజువయిందని తెలిపారు.

మరోవైపు తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేతలు సైతం ఇదే ఆశలతో ఎదురుచూస్తున్నారు. తమ ప్రాంతం నుంచే కాంగ్రెస్ అధ్యక్షుడు పోటీచేయాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. రాహుల్ గాంధీ తమిళనాడు నుంచే పోటీచేయాలంటూ కార్తీ చిదంబరం, మణికమ్ ఠాగూర్ సహా పలువురు నేతలు తమ ఇష్టాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. దక్షిణభారతంలో మార్పు మొదలైందని.. రాహుల్ గాంధీని అక్కడి నుంచే ప్రధానిగా చూడాలనుకుంటున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు

ఇక మరో వైపు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనబడుతోంది. ఇందిరాగాంధీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసీ గెలుపుని సాధించారని చెబుతున్నారు. అందుకే రాహుల్‌గాంధీ కూడా ఆంద్రప్రదేశ్ నుంచి పోటీ చేయాలని తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. గతంలో ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ నుంచి అయితే బాగుంటుందని అడుగుతున్నట్టు సమాచారం. ఇపుడు ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే…ఈ విషయంపై రాహుల్ గానీ, కాంగ్రెస్ పెద్దలు గానీ వెల్లడించే వరకూ ఈ వార్త నిజమా అబద్దమా అనేది తెలీదు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *