లండన్‌లో రాహుల్‌!

లండన్‌లో రాహుల్‌!

కాంగ్రెస్‌ పార్టీలో అధ్యక్ష పదవి సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. సమస్య పరిష్కారం కాకుండానే కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లండన్‌ వెళ్లారు. అధ్యక్షుడిగా రాహులే ఉంటారని ఆపార్టీ నేతలు చెప్పడానికి ఒకరోజు ముందే ఆయన లండన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్లకు కూడా ఆయన పర్యటనకు సంబంధించి వివరాలు కూడా తెలియనట్లు సమాచారం. రాహుల్‌ వారం రోజుల పాటు లండన్‌లో ఉంటారని, రేపు తిరిగి ఢిల్లీకి వస్తారని తెలుస్తోంది. ఇదిలాఉంటే.. ఎన్నికల అనంతరం అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆయన.. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *