బాలకృష్ణను అనుసరిస్తున్న రాహుల్‌గాంధీ!

బాలకృష్ణను అనుసరిస్తున్న రాహుల్‌గాంధీ!

మిగతా సమయాల్లో కంటే ఎన్నికల సమయంలో నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేసే అడుగు, చెప్పే మాట ఎక్కడా తప్పకూడదు. తప్పితే వచ్చే అనర్థం ఫలితాల్లోనే చూపిస్తుంది. అలా మాటల్లో తడబడుతూ దొరికిపోయే వాళ్లలో బాలకృష్ణ ముందుంటారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఉంటున్నారు. తాజాగా రాహుల్ గాంధీ మాట పలకడంలో ఇబ్బంది పడి వైరల్ అయ్యాడు.

కుంభకర్ణ నహీ కుంభరామ్…

రాజస్థాన్‌లో ఎన్నికలకు సంబంధించి జరిగిన బహిరంగ సభలో కుంభరామ్ అనే పదాన్ని కుంభకర్ణ అని పలికాడు. ఇది కాస్త వీడియో రూపంలో బయటకు రావడంతో ప్రతిపక్షాలు రాహుల్ గాంధీని ట్రోల్ చేశాయి. బహిరంగ సభలో మాట్లాడుతూ ‘ కుంభరామ్ ఆర్య లిఫ్ట్ యోజన కెనాల్ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావన వచ్చినపుడు… ప్రాజెక్ట్ పేరును తప్పుగా పలికాడు. కుంభరామ్ బదులు కుంభకర్ణ అని చెప్పేశాడు. ‘ అశోక్ గెహ్లాట్ కుంభకర్ణ లిఫ్ట్ యోజన కోసం నగదు ఇచ్చారు ‘ అని రాహుల్ ఒక సందర్భంలో పలికారు. అక్కడే వేదిక మీద ఉన్న మిగిలిన నాయకులు రాహుల్ తప్పుని సరిదిద్ది కుంభరామ్ అనమని మాటల్ని అందించారు.

కుంభకర్ణుడు ఆరు…కాంగ్రెస్ అరవై!

దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇదే అదునుగా ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలు…ఆ వీడియోను సామాజిక మాధ్యమాలో వైరల్ చేశాయి. ఈ వీడియోను కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ…రాహుల్ గాంధీ నిద్రపోతున్నారని చురకలేశాడు. ‘ ఆరునెలల పాటు కుంభకర్ణుడు నిద్రపోయాడు. అలా కాంగ్రెస్ 60 ఏళ్లుగా నిద్రపోతూనే ఉంది ‘ అని పీయూస్ ట్వీట్ చేశాడు.

దీనికి, బీజేపీ ప్రతినిధి సంబిత్ పత్రా స్పందించి…’ ఇటువంటి వ్యక్తికి మన దేశ ప్రధాని అయ్యే అర్హత ఉందని అనుకుంటున్నారు. దీన్ని బట్టి ఆయన ప్రజల్ని కుంభకర్ణులు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. గతంలో కూడా రాహుల్ గాంధీ ఇలాగే ప్రసంగంలో తప్పుగా మాట్లాడి నాలుక్కరుచుకున్న సందర్భాలున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *