ద్రావిడ్‌కు అరుదైన గౌరవం...

ద్రావిడ్‌కు అరుదైన గౌరవం...

టీం ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఐదవ భారత ఆటగాడిగా రికార్డు సాధించాడు. గురువారం తిరవనంతపురంలో భారత్, వెస్టిండీస్ తో జరిగిన చివరి వన్‌డేలో కామెంటేటర్‌గా వ్యవహరించిన సునీల్ గవాస్కర్ చేతుల మీదుగా ద్రావిడ్ ఈ జ్ఞాపికను అందుకున్నాడు.

ICC HAll Of Fame

ద్రావిడ్ అందుకు అర్హుడు

రాహుల్ ద్రావిడ్‌కి ముందు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో నలుగురు భారతీయులు చోటు సంపాదించారు. 2009లో బిషన్ సింగ్ బేడి, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్‌లకూ, 2015లో అనిల్ కుంబ్లేకూ ఈ గౌరవం దక్కింది. టీం ఇండియా తరపున ద్రావిడ్ 164 టెస్టులు, 344 వన్‌డే మ్యాచ్‌లు ఆడాడు. వండ్‌ల్లో 10889 పరుగులు, టెస్ట్ మ్యాచుల్లో 13288 పరుగులు సాధించాడు. ఇప్పటికీ ద్రావిడ్‌ను ఆరాధించే అభిమానులు లెక్కలేనంత మంది ఉన్నారు. ద్రావిడ్‌కు లభించిన ఈ గౌరవాన్ని అతడి అభిమానులే కాకుండా, యావత్‌ క్రికెట్‌ ప్రపంచమంతా ఎంజాయ్‌ చేస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *