విశాల్‌పై రాధిక ఫైర్‌

విశాల్‌పై రాధిక ఫైర్‌

తమిళనాడు నడిగర్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరోవైపు సినీనటులు రాధిక, విశాల్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. పాత విషయాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి మరీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

తమిళ నడిగర్ సంఘం ఎన్నికలు దగ్గర పడడంతో మళ్లీ ఒకరిపై మరొకరు మాటల దాడికి దిగారు. మరోసారి గెలిచి సత్తా చాటాలని విశాల్ సారధ్యంలోని పాండవర్‌ టీం ప్రయత్నిస్తుంది. అయితే ఈ సారి విశాల్‌ టీంకు వ్యతిరేకంగా భాగ్యరాజ్‌ బరిలో దిగటంతో పోటి ఆసక్తికరంగా మారంది. ప్రచారంలో భాగంగా విశాల్ ఇటీవల విడుదల చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది.

గత కమిటీలపై దుమ్మెత్తి పోస్తూ.. కొందరు శరత్ కుమార్‌పై చేసిన వ్యాఖ్యల వీడియోలను మళ్లీ తెరపైకి తెచ్చాడు విశాల్. అయితే ఈ వీడియోలపై శరత్ కుమార్ భార్య సీనియర్ నటి రాధిక, కుమార్తె వరలక్ష్మిలు తీవ్రస్థాయిలో విరుచుపడుతున్నారు. శరత్‌ కుమార్ కుమార్తె వరలక్ష్మి ఇప్పటికే విశాల్‌కు ట్విటర్‌ ద్వారా బహిరంగ లేఖ రాశారు. తన ఓటును కోల్పోయాడంటూ అంటూ ట్వీట్‌ చేశారు. గతంలో ఫ్రెండ్‌గా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ బయటపెట్టడం ఆయన దిగజారుడుతనా‌నికి నిదర్శనమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాల్‌ వ్యాఖ్యలపై శరత్‌కుమార్ సతీమణి రాధిక స్పందించారు. నిజంగా శరత్ కుమార్ తప్పు చేసుంటే న్యాయస్థానం తేలుస్తుందని.. కోర్టులో ఉన్న కేసుపై విశాల్ వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. నిజంగానే విశాల్ టీమ్ ఈ రెండేళ్ళలో అభివృద్ది చేసుంటే వాటిని చూపించి ఓట్లు అడగాలి అని అన్నారు. అయితే విశాల్ పాత విషయాలు, న్యాయస్థానంలో ఉన్న విషయాల‌ను మాట్లాడుతున్నారంటే… ఆయన నడిగర్ సంఘానికి చేసిందేమీ లేదని అర్థమవుతుందన్నారు. ఇదే ఇప్పుడు విశాల్ కు ఇబ్బందులు తెచ్చిపడుతుంది. 23న నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్న వేళ రాధిక, వరలక్ష్మిలతోపాటు మరికొందరు సీనియర్ల విమర్శలు దక్షిణాది సినిమా నటీనటుల సంఘంలో చర్చనీయాంశంగా మారింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *