ఒక స్టార్ హీరో అసభ్యంగా ప్రవర్తించాడు: రాధికా ఆప్టే

ఒక స్టార్ హీరో అసభ్యంగా ప్రవర్తించాడు: రాధికా ఆప్టే
రామ్ గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర తో సౌత్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రాధికా ఆప్టే ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. లెజెండ్ మరియు లయన్ సినిమాల్లో స్టార్ హీరో బాలకృష్ణ తో కలిసి నటించింది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలిలో లీడ్ రోల్ చేసే అవకాశం అంది పుచుకుంది. ఈ మధ్య ఒక హిందీ టీవీ షో లో పాల్గొన్న రాధికా ఒక తెలుగు హీరోపై తీవ్ర విమర్శలు చేసింది. సెట్లో తాను కూర్చొని ఉండగా, ఆ హీరో వచ్చి తన కాళ్ళని నిమిరాడని… తట్టుకోలేక చెంప పగలగొట్టానని వివరించింది. గతంలో ఆ హీరో ముఖం కూడా తెలియదని  క‌నీసం పరిచయం కూడా లేడ‌ని రాధికా ఆప్టే తెలిపింది. తెలుగు చిత్రాల్లో ఇక నటించనని, అక్కడ పురుషాధిక్యత ఎక్కువని, మహిళలను సరైన పద్ధతిలో గౌరవించరని చెప్పింది.
 
radhika apte news

సంచలన వ్యాఖ్యలు

ఇంతకీ, రాధికా చేత చెంప దెబ్బలు తిన్న ఆ స్టార్ హీరో ఎవరు అని సోషల్ మీడియా లో పెద్ద చర్చ జరుగుతుంది. హీరోయిన్స్‌లో చాలా మంది వ‌రుస‌గా తాము గ‌తంలో లైంగిక వేధింపుల‌కు గురైన విష‌యాల‌ను చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు ఆ సరసన రాధికా ఆప్టే కూడా నిలిచింది. ఆమె కుండ బద్దలు కొట్టినట్టు నిజం మాట్లాడుతూ, నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో ఉంటుంది. మొత్తంమీద ఓ అగ్రహీరో పై రాధిక చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.  మొన్నామధ్య బీచ్ లో బికినీ ఫోటోలు దిగి విమర్శలపాలయిన రాధిక – బీచ్ లో బికినీ కాకపోతే చీర కట్టుకుంటారా అని విమర్శకులపై తన స్టైల్ లో స్పందించింది. కాంట్రవర్సీలకి కేంద్రబిందువుగా మారిన రాధికా ప్రస్తుతం తమిళ్లో ఒకటి, హిందీలో మరో సినిమా చేస్తోంది.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *