రథయాత్రలో భక్తుల సమయస్పూర్తి

రథయాత్రలో భక్తుల సమయస్పూర్తి

ఒడిశాలో జులై 4న పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియోను అక్కడి ఎస్‌పీ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయిన రథయాత్ర కార్యక్రమం మధ్యలో ఓ అంబులెన్సు ఎటువంటి ఆటంకం లేకుండా ఆస్పత్రికి వెళ్లింది. 1,200 మంది వాలంటీర్లు, లక్షల మంది భక్తులు ఆ అంబులెన్సుకు దారి ఇచ్చి సమయస్ఫూర్తిని చాటారు. ఇందుకు సంబంధించిన వీడియో అబ్బుర పరుస్తోంది. మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలి ఉందని చాటి చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమంటూ తనెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *