పుల్వామాలో యుద్ధ తుపాకుల శబ్దం!

పుల్వామాలో యుద్ధ తుపాకుల శబ్దం!
ఒరిగిన దేహాలను మర్చిపోకముందే…ఒలికిన రక్తపు మరకలు ఆరకముందే…మరికొంత మంది జవాన్లను భారతదేశం కోల్పోయింది. దేశం మొత్తం ఉగ్రవాదులనూ, వారికి ఆశ్రయమిచ్చే పాకిస్తాన్‌నూ తుపాకులతోనే సమాధానం చెప్పాలని కసిగా కన్నెర్రజేస్తూ ఉన్న సమయంలోనే… సరిహద్దు ప్రాంతంలో యుద్ధ తుపాకుల శబ్దం మళ్లీ మొదలైంది. దాడులు, దెబ్బ కొట్టడాలు చాలా చిన్నవిషయాలు, శాంతి కోరుకోవడమే మానవుడి పరిణామక్రమానికి దిక్సూచిగా పాటించే భారత్‌ను  ఉగ్రవాదులు ఇంకా ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీరికి ఆశ్రయమిచ్చి పాకిస్తాన్ మరింత చెడుని తన దేశం గుప్పిట్లో భద్రపరుచుకుంటోంది. కానీ, భారత ఆర్మీ సంయమనాన్ని దాటి కోపం ప్రదర్శిస్తే ఉగ్రవాదుల ఆనవాళ్లు కూడా లేకుండా పోతాయని వారికి తెలియదు. అయితే, దుందుడుకు స్వభావంతో భారీ మూల్యమే చెల్లించుకునే దిశగా ఉగ్రవాదులు పయనించడం వారి అమాయకత్వం.

ఐదుగురి వీరమరణం!

పుల్వామా ప్రాంతంలో భారత ఆర్మీపై ఆత్మాహుతి దాడి తర్వాత మళ్లీ మరోసారి మనదేశం ఐదుగురు జవాన్లను కోల్పోవాల్సి వచ్చింది. సోమవారం తెల్లవారుఝామున భారత బలగాలకూ, ఉగ్రవాదులకూ జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు, ఒక పౌరుడు మరణించారు. పింగలాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పింగలాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు నిఘా వర్గాల ద్వారా సమాచారం రావడంతో…ఆర్మీలోని 55 రాష్ట్రీయ రైఫిల్స్, ఎస్ఓజీ, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. సోమవారం తెల్లవారుఝామున పింగలాన్ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తైన బలగాలు వారిపై ఎదురుకాల్పులు ప్రారంభించారు.
 
Pulwama encounter
 
ఉదయం జరిగిన ఈ దాడిలో మేజర్ డీఎస్ దోండియల్, హెడ్‌కానిస్టేబుల్ సవేరాం, జవాన్ అజయ్ కుమార్, హరిసింగ్‌లు ఈ ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. గుల్జార్ అనే జవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పౌరులు కూడా మరణించారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *