రూ.90 లక్షలతో పబ్లిక్‌ టాయిలెట్‌...

రూ.90 లక్షలతో పబ్లిక్‌ టాయిలెట్‌...

సాధారణంగా పబ్లిక్‌ టాయిలెట్‌ అంటే… మనకో అభిప్రాయం ఉంటుంది. వాటి శుభ్రత గురించి ముందుగానే మనసులో ఒక ఆలోచన పెట్టేసుకుంటాం. కొన్నికొన్ని చోట్ల మన అభిప్రాయానికి భిన్నంగా శుభ్రంగానూ ఉంటాయి. కానీ వాటిని ఉపయోగించుకోవడానికి ఎక్కువ డబ్బునే చెల్లించాల్సి ఉంటుంది. కానీ ముంబైలో నిర్మించిన ఈ టాయిలెట్‌ మాత్రం ఇప్పటివరకూ ఉన్న అభిప్రాయాలకు చెక్‌ పెడుతోంది. దాంతో పాటుగా పర్యావరణానికి అనుకూలంగానూ ఉన్నానంటుంది. వీటికి తోడుగా అత్యంత విలాసంగానూ ఉన్నానంటుంది. అసలు ఈ టాయ్‌లెట్‌ ఎక్కడుందో… దీని కథేంటో చూసొద్దాం పదండి. 

ముంబైలో…

పర్యావరణానికి అనుకూలంగా, పబ్లిక్‌కి సౌకర్యంగా ఉండేందుకు ముంబై మున్నిపాలిటీ వినూత్నంగా ఆలోచించింది. ముంబై నగరంలోని మెరైన్‌ డ్రైవ్ వద్ద, రూ.90 లక్షల ఖర్చుతో టాయిలెట్లని ఏర్పాటు చేసింది. వీటికి సోలార్ ప్యానెల్‌ను జత చేయడమే కాకుండా, వాక్యూమ్‌ క్లీనర్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీని వల్ల చాలా వరకు నీటిని పొదుపుగా వాడుకోవచ్చు. నీటినీ, పర్యావరణాన్నీ, ప్రజలనూ దృష్టిలో పెట్టుకునే ఖర్చు కోసం వెనకాడలేదని అధికారులు చెప్తున్నారు.

most expensive toilet

పదోవంతు నీళ్లే…

ప్రస్తుతం వాడుకలో ఉన్న టాయిలెట్లకు ఎక్కువ నీరు అవసరమవుతుంది. సగటున్న ఒక్కో ఫ్లష్‌కూ 8 లీటర్ల నీరు అవసరమవుతుంది. కానీ ఈ లేటెస్ట్‌ టాయిల్‌ట్‌ ఒక ఫ్లష్‌కు 800 మిల్లీలీటర్ల నీటిని మాత్రం వినియోగించుకుంటుంది. సాధారణ టాయిలెట్‌తో పోలిస్తే… దీనికి అందులో పదోవంతు నీరు మాత్రమే అవసరపడుతుంది. అయితే వీటికి మరో విశేషమూ ఉంది. ఎన్నో పబ్లిక్‌ టాయిలెట్స్‌లా వీటిని వాడుకున్నందుకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. వీటిని పూర్తి ఉచితంగా వినియోగించుకోవచ్చు. 

 
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *