పబ్‌జీలో బాహుబలి!

పబ్‌జీలో బాహుబలి!

ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి ఏ స్థాయిలో రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే…సినిమా వచ్చి ఇన్నేళ్లైనా బాహుబలి క్రేజ్ మాత్రం తగ్గలేదు. తాజాగా ఆన్‌లైన్ మల్టీప్లేయర్ గేమ్ పబ్‌జీ లో  ‘బాహుబలి’ ఔట్‌ఫిట్ రావడంతో మళ్లీ చర్చకు వచ్చింది. స్నేహితులతో కలిసి ఆన్‌లైన్లో ఆడే ఈ ఆటకు ఇండియాలో ఎంత ఆధరణ ఉందో తెలిసిందే. ఈ సందర్భంగా ఇండియాలోని అభిమానులను మరింత ఆకట్టుకునేందుకు పబ్‌జీ ‘బాహుబలి’ ఔట్‌ఫిట్ అందుబాటులోకి తీసుకువచ్చింది. పబ్‌జీ ఐటమ్ షాప్‌లో ‘గ్రేట్ ఇండియన్ వారియర్’ పేరుతో బాహుబలి వస్త్రాలను అందుబాటులోకి తెచ్చింది.

పబ్‌జీలో దీన్ని కొనుగోలు చేయాలంటే 1,260 ఊఛ్ (పబ్‌జీలో ధరలను ఊఛ్గా ఉపయోగిస్తారు. 300 ఊఛ్ విలువ రూ.9.76) చెల్లించాలి. అయితే, వినియోగదారులు Get it now ఆప్షన్ నొక్కినట్లయితే 25 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంటే సుమారు 945 ఊఛ్లకే బాహుబలి ఔట్‌ఫిట్‌ను పొందవచ్చు. ఈ డిస్కౌంట్ మే 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *