తూతూ మంత్రంగా ఫిట్ నెస్ పరిక్షలు

తూతూ మంత్రంగా ఫిట్ నెస్  పరిక్షలు

లంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరుచుకొనున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు తరలించేందుకు బస్సులో పైనే ఆధారపడుతున్నాయి .దాదాపు 95% ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల్ని బస్సులోనే తరలిస్తున్నాయి . ఈ బస్సులకు కాలం చెల్లడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి . వీటికి సామర్ధ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా తూతూమంత్రంగా పరీక్షలు చేపట్టడంతో యదేచ్ఛగా అవి రోడ్ల పైకి వస్తున్నాయి . విద్యా సంవత్సరం పొడుగునా ఈ డొక్కు బస్సులు విద్యార్థులు తిరగడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి . అయినప్పటికీ రవాణా శాఖ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవరిస్తున్నారు.

విద్యాసంస్థల బస్సులకు ప్రతియేటా మే నెలలో తనిఖీలు చేస్తారు. బస్సుల సామర్ధ్యం గడువు ఇచ్చి అనంతరం తనిఖీలు చేపట్టి ధ్రువీకరణ పత్రం అయితే రవాణా శాఖ లో తీవ్ర సిబ్బంది కొరత ఉంది . ఈనెల 12 నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి . కేవలం కొన్ని బస్సులకు మాత్రమే సామర్ధ్య పరీక్షలు జరిగాయి . .అయితే నిబంధనల ప్రకారం ఈ పరీక్షలకు ఒక్క బస్సును క్షుణ్నంగా తనిఖీ చేయాలంటే సుమారు 20 నిమిషాలు పడుతుంది . తనిఖీ సిబ్బంది అంతంత మాత్రంగా ఉన్నారనే సాకుతో ఇటు స్కూల్ యాజమాన్యాలు అటు ఆర్టీఏ అధికారులు జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫిట్‌నెస్‌ పరిక్షలు నిర్వహించాలని కోరుతున్నారు.

స్కూల్ బస్సుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని ఫిట్‌నెస్ పరీక్షలు జరుపుతున్నారు . .ట్రాన్స్‌పోర్ట్ తెలంగాణ వెబ్‌సైట్లో విద్యాసంస్థలు లాగిన్ అవ్వాలి . అందులో స్కూలు వివరాలన్నీ నమోదు చేయాలి. విద్యా సంస్థ పేరు ,యజమాని పేరు ,చిరునామా ,వాహనం రిజిస్ట్రేషన్ ,ఈ మెయిల్ ఐడిలను నమోదు చేయాలి .అనంతరం అధికారులు ఒక యూజర్ ఐడి , పాస్‌వర్డ్ ఇస్తారు .అందులో విద్యాసంస్థల బస్సు వివరాలను నమోదు చేయాలి . విద్యాసంస్థల బస్సు డ్రైవర్ ,అటెండర్ పేర్లు ,చిరునామాలతో పాటు వారి ఫోటోలను అప్లోడ్ చేయాలి . బస్సు లో ఉండాల్సిన ప్రథమ చికిత్స పెట్టె , లైట్లు , ఇతర వివరాలను పొందుపరచాలి . డ్రైవర్ లైసెన్స్ నెంబర్‌తో పాటు బస్సు రూట్ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది .మొత్తానికి మళ్లీ స్కూళ్ల ప్రారంభంతో స్కూలు బస్సులు సామర్ధ్య పరీక్షలకు కు సమయం ముంచుకొచ్చింది .అయితే సమయం తక్కువగా ఉండటంతో అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు .మరోవైపు సాంకేతికంగా కొత్త సౌకర్యాలు తెచ్చినప్పటికీ అవి ఆశించిన ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా అధికారులు పని చేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *