ఆరంగ్రేటం అదుర్స్

ఆరంగ్రేటం అదుర్స్

రాజ్ కోట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ పృథ్వీషా సెంచరీ సాధించాడు. ఆరంగేట్ర మ్యాచ్ లోనే సెంచరీ సాధించి జట్టులో తన ఎంపిక సరైనదే అని నిరూపించాడు.  జట్టు స్కోర్ 3 పరుగుల వద్దే ఓపెనర్ లోకేశ్ రాహుల్ డకౌట్ అయినప్పటికీ పృథ్వీషా… దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. 99 బంతుల్లో 15 ఫోర్ల సహాయంతో 101 పరుగులు చేసాడు. పృథ్వీషా స్ట్రైక్ రేట్ 102 అంటే.. వన్డే తరహాలో ఆడుతూ సునాయాసంగా సెంచరీ సాధించాడు. 

prithvi shaw century

అతిపిన్న వయసులో టెస్ట్ ఆరంగ్రేటం చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా సచిన్ టెండుల్కర్, పార్థివ్ పటేల్ తర్వాతి స్థానంలో నిలిచిన పృథ్వీషా… మొదటి హాఫ్ సెంచరీ నమోదుచేసిన పిన్న వయస్కుడిగానూ మూడో స్థానంలో నిలిచాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *