చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు హ్యాట్రిక్ సాధిస్తారా?

చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు హ్యాట్రిక్ సాధిస్తారా?

 

చిలకలూరిపేటలో ఈసారి గట్టిపోటీ జరిగేలా కనబడుతోంది. గుంటూరులో ఆర్థికంగా బలమైన నియోజకవర్గం చిలుకులూరిపేట. మొత్తం ఓటర్ల సంఖ్య 1,90,398.  గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన మంత్రి పత్తిపాటి పుల్లారావు ఈసారి కూడా పోటీకి సిద్ధమయ్యారు. వైసీపీ అభ్యర్థిగా విడదల రజినీ ప్రత్యర్థి అబ్యర్థిగా ఉన్నారు. ఇప్పటిదాకా పార్టీల నుంచి అభ్యర్థుల జాబితా రానప్పటికీ వీరిద్దరికే టిఎకెట్ దక్కె అవకాశం కనిపిస్తోంది. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం రాత్రి జరిగిన చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ బాధ్యుల సమావేశంలో పాల్గొన్నవారంతా ఏకగ్రీవంగా పత్తిపాటి పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన పేరును అధికారికంగా ప్రకటించడమే మిగిలుంది. ఇప్పటికే పత్తిపాటి పుల్లారావు యడ్లపాడు మండలంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇక విడదల రజనీ కూడా చిలకలూరిపేట నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఆమె పేరు ఇంచుమించు ఖరారుగానే తెలుస్తోంది. మొదట ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు మర్రి రాజశేఖర్‌ను అనుకున్నారు. అయితే పుల్లారావుకు గట్టి పోటీ ఇవ్వాల్సి ఉండటంతో రజనీ అయితే గట్టి పోటీ ఇవ్వగలరని అధిష్ఠానం భావించినట్టు తెలుస్తోంది. అందుకే రజనీకి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను కూడ అప్పగించినట్లు స్థానిక నేతలు చెబుతున్న మాట. మొదట రాజశేఖర్ పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లుగా వ్యవహరించినప్పటికీ ఆ తర్వాత సర్దుకుపోయారు. విడదల రజినీ గత కొద్ది నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పార్టీ విజయం కోసం రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పత్తిపాటి పుల్లారావు సుదీర్ఘకాలంగా ఈ నియోజకవర్గ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. స్థానిక ప్రజలతో ఆయనకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. 1999 ఎన్నికలలో ఆయన తొలిసారిగా తెలుగుదేశంపార్టీ తరపున పోటీచేసి దాదాపు 27వేల ఓట్ల భారీ మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి సోమేపల్లి సాంబయ్యపై ఘన విజయాన్ని దక్కించుకున్నారు. 2004 ఎన్నికల్లో తిరిగి ఆయన టీడీపీ తరపున పోటీచేసినప్పటికీ ఇండిపెండెంట్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ చేతిలో కేవలం 212 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

2009లో జరిగిన ఎన్నికలలో పత్తిపాటి పుల్లారావు టీడీపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌పై 19,813 ఓట్ల మెజారిటీతో గెలుపుని సొంతం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో మర్రి రాజశేఖర్‌ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆ ఎన్నికలలో పుల్లారావు రాజశేఖర్‌పై 10,684 ఓట్ల మెజారిటీతో గెలుపుని దక్కించుకున్నారు. గత రెండు ఎన్నికల్లో రికార్డు విజయాలతోతో ఉన్న మంత్రి ఈ ఎన్నికలకు ధీమాగానే సిద్ధమవుతున్నారు. ఈసారి కూడా రికార్డు స్థాయి మెజారిటీ నమోదు చేసి గెలుస్తారని టీడీపీ కార్యకర్తలు నమ్మకంగా చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *