హాలీవుడ్ రేంజ్‌లో ఉన్న సాహో

హాలీవుడ్ రేంజ్‌లో ఉన్న సాహో

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్…సినిమా చరిత్ర గురించి మాట్లాడితే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని చెప్పుకునే స్థాయిలో రికార్డులు సాధించింది. ఈ సినిమాతో తెలుగులో స్టార్ హీరోగా ఉన్న ప్రభాస్ కాస్త జాతీయ స్థాయి కథానాయకుడు అయ్యాడు. బాహుబలి తర్వాతా చాలా ఎక్కువ గ్యాప్ తీసుకున్న సినిమా సాహో గురించి ఇటు ప్రభాస్ అభిమానులు, అటు సినిమా ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై జాటీయస్థాయిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. దాదాపు రెండున్నరేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా గురించి ఎన్నో రూమర్లు వచ్చాయి. ఈ సినిమా దర్శకుడు ఒక్క సినిమా హిట్‌తో ప్రభాస్‌తో చేసే ఛాన్స్ దక్కించుకున్నాడని, స్టార్ హీరో, స్టార్ ప్రొడక్షన్, భారీ బడ్జెట్ కారణంగా అన్నిటినీ హ్యాండిల్ చేయలేకపోతున్నాడనే వార్తలు అప్పట్లో తెగ చక్కర్లు కొట్టాయి. ఆ రేంజ్ హిట్ కొట్టగలడా అనే రూమర్లూ వచ్చాయి.

ఈరోజు ప్రభాస్ అభిమానులతోపాటు, జాతీయస్థాయి సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘సాహో’టీజర్ రిలీజ్ అయింది. నిజానికి ఈ టీజర్ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇపుడు టీజర్ రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. హాలీవుడ్ స్థాయిలో ఉన్న సాహో టీజర్ ప్రేక్షకులను అలరిస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *