మెగా హీరోకి షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్

మెగా హీరోకి షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్

మహర్షి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్ పూజ హెగ్డే కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది.. దీంతో ఇప్పుడే కెరీర్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవాలనుకున్న పూజ, టాప్ హీరోల సినిమాల్లో అవకాశం కోసం ఒక మెగా హీరోకే భారీ షాక్ ఇచ్చింది.

Pooja hegde remuneration c

మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు అంటే ఎవరూ వదులుకోరు. ఆ కాంపౌండ్ లో అడుగుపెడితే స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ త్వరగా వస్తుందని అంతా అనుకుంటారు కానీ పూజాహెగ్డే మాత్రం వరుణ్ తేజ్ సినిమాకు నో చెప్పి గట్టి షాక్ ఇచ్చింది. టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్‌ ఫాంలో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే భారీ చిత్రాల్లో నటిస్తూ హిట్స్ అందుకుంటోంది. ఇటీవల మహర్షి సినిమాతో ప్రేక్షకులని మెప్పించిన పూజ, బన్నీ… ప్రభాస్, వరుణ్ తేజ్ సినిమాలకి ఓకే చెప్పింది. అయితే తాజా సమాచారం ప్రకారం వాల్మీకి నుంచి పూజా హెగ్డే తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.

డేట్స్ అడ్జస్ట్‌ కానీ కారణంగానే పూజ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్టుగా పూజ హెగ్డే చెప్తోంది కానీ డేట్స్ విషయం కన్నా ఎక్కువగా రెమ్యునరేషన్ విషయంలోనే తేడా కొట్టిందని, అందుకే పూజ వాల్మీకి సినిమా నుంచి తప్పుకుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కేవలం 15రోజులకే పూజ రెండు కోట్లు అడగడంతో నిర్మాతలు కూడా పూజ విషయంలో సైలెంట్ అయ్యారు. మరి వాల్మీకి సినిమాలో పూజ ప్లేస్ లో ఏ హీరోయిన్ వస్తుందో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *