స్టార్ హీరోయిన్ మందేసి దొరికిపోయిందా?

స్టార్ హీరోయిన్ మందేసి దొరికిపోయిందా?

రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక హిట్ సినిమాలో నటించిన ఒక టాప్ హీరోయిన్, పార్టీ చేసుకోని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకి దొరికిపోయిందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది… ఇంతకీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఆ హిట్ సినిమా ఏంటి? డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఆ టాప్ హీరోయిన్ ఎవరో చూడండి..

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 25వ సినిమా మహర్షి, ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి వసూళ్లని రాబడుతోంది. మహేశ్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ‘మహర్షి’ నిలవడంతో చిత్ర యూనిట్, సక్సస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన పార్టీలో మహర్షి యూనిట్ అంతా పాల్గొన్నారు. అయితే మహర్షితో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే, సక్సస్ మీట్ పార్టీలో ఫుల్లుగా మందు కొట్టి, పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిపోయిందని సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అయ్యింది.

సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తల్లో నిజంలేదని, సక్సస్ మీట్ అయ్యాక పార్టీ చేసుకున్న మాట వాస్తవమే కానీ ప్రొడక్షన్ టీమ్, పార్టీకి వచ్చిన వారందరికీ వెహికల్స్ ప్రొవైడ్ చేసిందని… అదే సమయంలో ఎయిర్పోర్ట్ కి వెళ్లాల్సిన పూజా హెగ్డేకి కూడా ఓ డ్రైవర్ ను ఇచ్చి, డ్రాప్ చేయించారని… పూజ ఎయిర్పోర్ట్ కి వెళ్లే టైములో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో కారులో పూజ కనిపించిందే తప్ప, ఆమె డ్రైవ్ చేయలేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. నిప్పు లేనిదే పొగ రాదు కాబట్టి… ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న మాటల్లో వాస్తవం ఉండకపోవచ్చు అనేది కొందరి అభిప్రాయం.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *