నాయకులారా..! ఇది ప్రజాస్వామ్యమా! హింసా రాజ్యమా..!

నాయకులారా..! ఇది ప్రజాస్వామ్యమా! హింసా రాజ్యమా..!

“ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ మోజో టీవీ ప్రతినిధులపై చేసిన మాటల దాడి”“ఈ ఎన్నికలలో మనం విజయం సాధించాలి.ఎవరు అడ్డం వచ్చినా కాళ్ళు చేతులు తీసేయండి.పోలీసులతో నేను మాట్లాడతా” ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడి ఆదేశం.

ప్రజలు మండిపడుతున్నారు…

వారు విధి నిర్వహణలో నిమగ్నమై ఉంటారు.వాళ్లకు కులాలు,మతాలు,రాజకీయ పార్టీలు,డబ్బున్న వారు,నిరుపేదలు అనే తేడా ఉండదు.సమాజంలో ఎలాంటి అన్యాయం జరిగినా…. జరుగుతుందని తెలిసినా తమ విధి నిర్వహణలో ప్రాణాలు వదలడానికయినా సిద్ధపడతారు.సమాజంలో ఇతరులకు మేలు చేయాలనే సంకల్పమే వారి ఉద్యోగ ధర్మం.ఆ ధర్మాన్ని తూచాతప్పక నెరవేరుస్తున్న వాళ్ళే జర్నలిస్టులు.ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు నానాటికీ పెరుగుతున్నాయి.దీనికి తెలుగు రాష్ట్రాలు కూడా మినహాయింపు కాదు.తాజాగా తెలుగుదేశం పార్టీ హిందూపురం అభ్యర్థి, నటుడు నందమూరి బాలకృష్ణ మోజో టీవీ ప్రతినిధులపై దుర్భాషలతో అమానుష దాడి చేశారు.”బాంబులు వేస్తా… నరుకుతా”అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టు సంఘాలేకాదు… తెలుగు ప్రజలూ మండి పడుతున్నారు.బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో “తెలుగు ప్రజల ప్రజాస్వామ్యంలో బతుకుతున్నారా..? ” హింసా రాజ్యంలో బతుకుతున్నారా..? అనేది అర్థం కావటం లేదంటున్నారు.

ఇదేనా అన్న గారు నేర్పిన సంస్కృతి..!?

తెలుగు సంస్కృతి, ప్రజల పట్ల ఎంతో ఆదరాభిమానాలు చూపించిన ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమారుడు బాలకృష్ణ ఇలా మాట్లాడడం తగదని రాజకీయ పార్టీలకు చెందిన వారితో పాటు సామాన్యులు సైతం హితవు పలుకుతున్నారు.బాలకృష్ణ … పేరున్న సినీ నటుడనీ,పైగా ఆయనకు అభిమానగణం ఎక్కువగానే ఉంటుందనీ,ఆయనతో ఫొటోలు తీయించుకోవాలనుకునే వారు ఎక్కువ ఉత్సాహం చూపిస్తారనే సంగతి బాలకృష్ణకు తెలియదా… ? అని ప్రశ్నిస్తున్నారు.గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు… మీడియా పైనా,ప్రభుత్వాధికారులపైనా విరుచుకుపడ్డ సంఘటనలు అనేకం ఉన్నాయంటున్నారు.ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ ప్రజా ప్రతినిధి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి తీరాలని, అందుకు అడ్డం వచ్చిన వారిని ఏమైనా చేయండి అంటూ తన కార్యకర్తలకు పిలుపునివ్వడాన్ని గుర్తు చేస్తున్నారు.ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇది సంచలంగా మారింది.

వారే కాదు… వీరు కూడా…

ఇక పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే ఇసుక తరలింపు వ్యవహారంలో మహిళా తాసిల్దార్ పై చేయి చేసుకున్నారు.ఇది అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం అయ్యింది.రాయలసీమకు చెందిన మాజీ ఎమ్మెల్యే,అధికార తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు మీడియా పైనా.. పోలీసుల పైనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి.ఈ వ్యాఖ్యలు,అధికార పార్టీకి చెందిన నాయకుల మాటల దాడులు విన్న వారికి “మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? లేక హింసారాజ్యంలో ఉన్నామా…? అనే అనుమానాలు కలిగిస్తున్నాయి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *