గుడ్లగూబలను మాయంచేస్తున్న రాజకీయనాయకులు

గుడ్లగూబలను మాయంచేస్తున్న రాజకీయనాయకులు

ఎన్నికల్లో గెలవాలంటే ప్రచారం చురుగ్గా చేయాలి. కార్యకర్తలతో ఎప్పటికపుడు మంతనాలు జరుపుతూ ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ కొంతమంది నాయకులు మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతున్నారు. ఎంతో టెక్నాలజీ పెరిగి, సైన్స్‌లోనూ ఎన్నో దశల్ని దాటి వెళుతున్న ఇప్పటి కాలంలో కూడా ఇలా జరగడం వింతే కానీ అంతకు మించిన వింత రహస్యం ఇక్కడొకటి ఉంది. ప్రజల్ని చైతన్యపరిచి మూఢనమ్మకాల జోలికి పోకుండా చేయాల్సిన రాజకీయనాయకులే ఇలా మూఢనమ్మకాలను విశ్వసించి అభాసుపాలు అవుతున్నారు.

telangana elections

మూఢనమ్మకాలు ఇంకానా..!

కర్ణాటకలోని సేళం పట్టణంలో ఈ మధ్య కొందరు వేటగాళ్లు రెండు గుడ్లగూబలను అక్రమ రవాణా చేస్తూ దొరికిపోయారు. వారిని విచారించిన పోలీసులకు కళ్లు రాలిపోయే నిజాలు తెలిశాయి. తెలంగాణ ఎన్నికల్లో క్షుద్రపూజలు చేసి వీటిని బలివ్వడానికి ఓ నాయకుడు అడిగాడని ఆ నిందితులు చెప్పారు. ప్రత్యర్థులకు కీడు జరగాలని ఈ గుడ్లగూబలను క్షుద్రపూజల్లో వాడుకుంటున్నారని తెలిసింది. పెద్ద పెద్ద కళ్లతో ఉండే గుడ్లగూబల గురించి గతంలో ప్రజలు గుడ్డిగా మంచి జరుగుతుందని వాటిని క్షుద్రపూజల్లో బలిచ్చేవారు. అవి ఇప్పటికీ కొనసాగుతుండటం, అది కూడా రాజయకీయనాయకులు ఇలాంటి వాటిని నమ్మడం మరింత ఆశ్చర్యంగా ఉంది.

అంతరించిపోతున్నాయి…

ఇలాంటి నమ్మకాలు కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కొనసాగుతున్నాయి. ఇలాంటి గుడ్డి నమ్మకాల వల్ల దేశవ్యాప్తంగా ఏడాదికి 75 వేల గుడ్లగూబలు బలి అవుతున్నాయనే అంచనాలున్నాయి. వీటి వల్ల కలిగే మంచి గురించి ఆలోచించకుండా…బలివ్వడం వల్ల వ్యవసాయరంగానికి చాలా నష్టం తెచ్చుకుంటున్నారు. గుడ్లగూబలు పంటలను నాశనం చేసే చీడ పురుగులను తిని రైతులకు చాలా మేలు చేస్తాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *