ఆన్‌లైన్ కిడ్నీ రాకెట్‌ గుట్టురట్టు

ఆన్‌లైన్ కిడ్నీ రాకెట్‌ గుట్టురట్టు

తెలంగాణ పోలీసులు మరోసారి తమ మార్కును చూపింపిచారు. ఆన్‌లైన్‌లో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేశారు. నిందితుడిపై నిఘాపెట్టి పట్టుకున్నారు. నిందితుడి నుంచి ఫేక్ డాక్యుమెంట్లు, సెల్‌పోన్లు స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకున్నారు.

కిడ్నీ డోనార్ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు వల వేసి పట్టకున్నారు. చెన్నైలోని మధురైకి చెందిన సూర్యశివరాం అనే వ్యక్తి అమాయకులను టార్గెట్ చేసుకోని ఆన్ లైన్ లో కీడ్నీ సెల్స్ రాకెట్‌ను నడుపుతున్నాడు. వెబ్ సైట్లో కీడ్నీ డోనర్స్, బయ్యర్స్ అని ఒక లింక్‌ని క్రియేట్ చేశాడు. ఎవరికైనా… కీడ్నీలు అవసరం ఉన్నవారు అతడిని అప్రోచ్ రిజిస్ట్రేషన్ పేరుతో 15000వేల రూపాయలు వసూలు చేస్తున్నాడు. రిజిస్ట్రేషన్ పీజుతో పాటు,ఆధార్ ,పాన్ ,బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకోని ఆన్ లైన్‌ల్లో 50శాతం డబ్బులు అతడి ఖాతాలో వేసుకుంటున్నాడు. ఆపరేషన్ తరువాత మిగతా 50శాతం డబ్బులు ఇవ్వాలని క్లయింట్లకు చెప్పి ఫేక్ డోనర్ కీడ్నీ ఫేడరేషన్ సర్టీఫీకేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నాడు.

ఇలా కీడ్నీలు అమ్ముతున్నానని చెప్పి ఆన్ లైన్‌లో క్లయింట్ల నుంచి లక్షల నుంచి కోట్లు వసూలు చేశాడని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. కీడ్నీ డోనర్స్ ,బయ్యర్స్ పేరుతో ఆన్ లైన్ పేమెంట్ యాప్ ల ద్వారా కోట్లు వసూలు చేశాడని అన్నారు. హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో కీడ్నీఆపరేషన్ చేపిస్తానని నమ్మించి మోసం చేసి.. ఆన్ లైన్‌లో ఫేక్ సర్టీఫికేట్స్‌తో డబ్బులు వసూలు చేసిన తరువాత ఫోన్ స్వీఛాఫ్ చేసి మోసానికి పాల్పడతాడని సీపీ తెలిపారు.

మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులులకు సూర్యశివరాం సంబంధించిన సమాచారం తెలియడంతో నిఘా పెట్టి నేరేడ్ మెట్ ఎక్స్ రోడ్డులో రెడ్ హ్యండెడ్ పట్టుకున్నారు. నిందితుడి నుంచి ఫేక్ డాక్యుమెంట్స్, సెల్ ఫోన్స్‌లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనంతరం ఆన్ లైన్‌లో ఎవరైనా కీడ్నీ అమ్ముతాం అంటే నమ్మెద్దని తెలిపారు. కిడ్నీ అనేది రక్త సంబందీకులకు మాత్రమే ఇవ్వగలరని.. ఇతరలక దగ్గర తీసుకోవాడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. ఏవరైనా కిడ్నీ అమ్ముతామని చెబితే తమకు ముందుగా సమాచారం ఇవ్వాలని అన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *