పోలవరం నిర్మాణ పనుల్లో గిన్నిస్‌ రికార్డు

పోలవరం నిర్మాణ పనుల్లో గిన్నిస్‌ రికార్డు

పోలవరం సరికొత్త చరిత్ర సృష్టించింది. నిన్న అర్ధరాత్రి 12 గంటలకల్లా 22,045 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తిచేసి నవయుగ గిన్నిస్‌ రికార్డు సాధించింది. 2017లో యూఏఈలో ఓ టవర్‌ నిర్మాణంలో భాగంగా 24 గంటల్లో 21,580 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేశారు. ఆ రికార్డును పోలవరం అధిగమించింది. 24 గంటలకు 30 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు పనులు కొనసాగించి కాంక్రీటు వేయడం ద్వారా ఇప్పట్లో ఎవరూ ఈ రికార్డును అధిగమించకుండా ఉండేలా ప్రాజెక్టు అధికారులు ప్లాన్‌ చేశారు.


ఈ మహాయజ్ఞంలో 3,600 మంది కార్మికులు, 500 మంది సాంకేతిక సిబ్బంది పనిచేశారు. 2 లక్షల బస్తాల సిమెంట్‌, 40 క్యూబిక్‌ మీటర్ల మెటల్‌, 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక, కాంక్రీటులో కలపడానికి 200 టన్నుల యార్డ్‌ మిక్చరు ఉపయోగించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *