ఫ్రోజెన్ ప్యాంట్...మనిషి లేకుండా నిలబడే ప్యాంట్స్

ఫ్రోజెన్ ప్యాంట్...మనిషి లేకుండా నిలబడే ప్యాంట్స్
హాలీవుడ్ సినిమాల్లో కొన్ని పాత్రలకు అద్భుత శక్తులుంటాయి. ఒకరు నీటిని ఉపయోగించుకుని బలవంతులైతే…మరొకరు నిప్పుతో శక్తివంతులవుతారు. ఇదంతా పక్కా సినిమా స్క్రిప్ట్ ప్రకారం గ్రాఫిక్స్‌తో చేసే మాయాజాలం. ఇలాంటి సాహసాలు వాస్తవ జీవితంలో కుదరవు. అయితే…ప్రకృతి ప్రత్యేకంగా మనిషి రూపంలో ఉండనవసరం లేదు. దానికంటూ ఒక గుణం ఉంటుంది. దానితోనే వాతావరణాన్ని, మనుషుల్ని తన మాయాజాలంతో ఇబ్బందులు పెట్టేస్తుంది.

ఖాళీటైం ఇచ్చిన పని…

ప్రస్తుతం చలి ప్రజలమీద యుద్ధం ప్రకటించింది. అమెరికాలో ఏకంగా మంచుపాతం సృష్టిస్తోంది. పోలార్ వర్టెక్స్ ప్రభావంతో అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మైనస్ 50 డిగ్రీలు ఉండటంతో చలికి మనుషులు మంచు శిలల్లా మారిపోయేంత దారుణంగా ఉంది. ప్రభుత్వం ప్రజలను బయటకు రావొద్దంటూ రోజూ హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే…ఏదైనా విపరీతం జరిగితే సరదాగా దానితో గడపడం మనిషికి అలవాటు. బిజీ లైఫ్ అయిపోయిన ఈ తరంలో వినోదం కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి ఆనందంగా గడపడం నేర్చుకుంటున్నాడు మనిషి. అలాంటిది ఈ చలి కారణంగా ఇంటివద్దే ఉండిపోవాల్సి రావడంతో చలిని వాడుకుని అమెరికా ప్రజలు వినోదాన్ని పొందుతున్నారు.

వేడినీళ్లు, కాఫీలు గతం !

మొన్నటివరకు చలి ఎంత విపరీతంగా ఉందో చూపిస్తూ…వేడి నీళ్లను, వెచ్చని కాఫీని గాల్లోకి ఎగరేస్తూ అవి మంచుధూళిలా మారిపోవడం వీడియో తీసి వైరల్ చేశారు. కొన్నిరోజులు ఇదే ట్రెండ్‌గా చేశారు. ఇపుడు ఇంకొక దశలోకి మారారు అక్కడి జనాలు. అదేంటంటే…ఇంట్లో ఖాళీగా మూలన పడ్డ ప్యాంట్స్‌ను చలిలో ఒంటరిగా నిలబెట్టాలి. దుస్తులు ఏ ఆధారం లేకుండా ఎలా నిలబడతాయనే కదా మీ అనుమానం…అక్కడ మైనస్ 50 డిగ్రీల తీవ్రతకు ఉష్ణొగ్రత పడిపోవడంతో…ప్యాంట్లనే కాదు దారాలను కూడా నిలబెట్టొచ్చు. కాకపోతే వాటిని నిలబెట్టేముందు నీళ్లలో తడపాల్సి ఉంటుంది.

 

 
 
 
View this post on Instagram
 
 

 

#usps powerhouse. Gus thinks that bag is full of dog treats. #frozenpants

A post shared by Tom Grotting (@tomgrotting) on

 

 
 
 
View this post on Instagram
 
 

 

#ccso #frozen #frozenpants #polarvortex #stupidcold #minnesota

A post shared by Chisago Co Sheriff’s Office (@chisagocountyso) on

A post shared by Chisago Co Sheriff’s Office (@chisagocountyso) on

ఫ్రోజెన్ ప్యాంట్ ఛాలెంజ్…

ఫ్రోజెన్ ప్యాంట్ ఛాలెంజ్ పేరుతో ఇదే ఇపుడు ట్రెండ్‌గా మారింది. ప్యాంట్లను నీళ్లలో తడిపి బయట తీసుకొస్తున్నారు. తడి ఉండటం వల్ల అవి నిమిషాల్లో గడ్డకట్టిపోతున్నాయి. ఎటువంటి ఆధారం లేకుండా నిలబడుతున్నాయి. అలా వాటి ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వణికించాలని చూస్తున్న చలిని జనాలే రకరకాల ప్రయోగాలతో విసిగించి విసిగించి భయపెట్టేలా ఉన్నారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *