80'ల్లోనే డిజిటల్ కెమెరా వాడానంటూ సోషల్ మీడియాకు చిక్కిన మోదీ

80'ల్లోనే డిజిటల్ కెమెరా వాడానంటూ సోషల్ మీడియాకు చిక్కిన మోదీ

సోషల్ మీడియా పుణ్యమా అని…రాజకీయనాయకులు చెప్పే గారడీలను ప్రజలు ఇట్టే పసిగడుతున్నారు. గతంలో కొందరు నాయకులు నెటిజన్ల దెబ్బకు మైకుల ముందు మౌనం పాటిస్తుండటం విశేషం. ఇపుడు ఏకంగా దేశ ప్రధానియే నెటిజన్లకు దొరికిపోయారు. గతవారం ఓ ఇంటర్వ్యూలో బాలాకోట్ దాడుల గురించి ప్రస్తావిస్తూ…మేఘాలను అడ్డుపెట్టుకుని దాడి చేయాలను కున్నాం..దానికి మేఘాలు సహకరించలేదని చెప్పి…ప్రత్యర్థి పార్టీ నాయకులకు, నెటిజన్లకు సులువుగా దొరికిపోయిన మోదీ…దాని గురించి ఎటువంటి స్పందన ఇవ్వకుండానే మరోసారి దొరికిపోయారు. సోషల్ మీడియా పుణ్యమా అని…రాజకీయనాయకులు చెప్పే గారడీలను ప్రజలు ఇట్టే పసిగడుతున్నారు. గతంలో కొందరు నాయకులు నెటిజన్ల దెబ్బకు మైకుల ముందు మౌనం పాటిస్తుండటం విశేషం. ఇపుడు ఏకంగా దేశ ప్రధానియే నెటిజన్లకు దొరికిపోయారు. గతవారం ఓ ఇంటర్వ్యూలో బాలాకోట్ దాడుల గురించి ప్రస్తావిస్తూ…మేఘాలను అడ్డుపెట్టుకుని దాడి చేయాలను కున్నాం..దానికి మేఘాలు సహకరించలేదని చెప్పి…ప్రత్యర్థి పార్టీ నాయకులకు, నెటిజన్లకు సులువుగా దొరికిపోయిన మోదీ…దాని గురించి ఎటువంటి స్పందన ఇవ్వకుండానే మరోసారి దొరికిపోయారు.

ఇండియాను డిజటల్ రంగంపై వైపు వెళ్లాలని కోరిన మోదీ.. డిజిటల్ కెమెరాలపై తన ఆసక్తి ఎలా ఉండేదో ఇంకొక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. 1987లోనే మోదీ..మొదటిసారి డిజిటల్ కెమెరా కొన్నట్టు అప్పటి జ్ఞాపకలాను ఆయన గుర్తు చేసుకున్నారు. 1987-88 మధ్యకాలంలోనే డిజిటల్ కెమెరా వాడినట్టు చెప్పారు. నిజానికి అప్పటికీ ఇంకా డిజిటల్ కెమెరాలు అందుబాటులో రాలేదు. దీంతో నెటిజన్లు మోదీపై సెటైర్లతో విరుచుకుపడ్డారు.

అంతే కాకుండా..1988 కాలంలోనే తాము ఈ-మెయిల్స్ వాడేవాళ్లమని చెప్పుకొచ్చారు. అప్పట్లో బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో తాను మొదటిసారి డిజిటల్ కెమెరాతో కవర్ చేసినట్టు చెప్పారు. తన డిజిటల్ కెమెరాతో అద్వానీ ఫోటో తీసి.. ఈ మెయిల్ ద్వారా పంపినట్టు తెలిపారు. అప్పుడు అది కలర్ ఫోటో ప్రింట్ తీసినట్టు గుర్తు. ఆ ఫోటోను అద్వానీకి చూపించగా.. ఆయన ఆశ్చర్యపోయానట్టు మోదీ చెప్పారు. ఇలా అసంబద్ధంగా మాట్లాడిన మోదీ వ్యాఖ్యలను సోషల్ మీడియాల్లో నెటిజన్లు విపరీతంగా వైరల్ చెస్తూ ఆటపట్టిస్తున్నారు. ఫస్ట్ డిజిటల్ కెమెరా 1987లో నికాన్ నుంచి వచ్చిందని, కమర్షియల్ ఈమెయిల్స్ 1990-95 మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చాయని యూజర్లు గుర్తుచేస్తున్నారు. డిజిటల్ కెమెరా, ఈమెయిల్ వాడిన ఏకైక, మొట్టమొదటి వ్యక్తి మోదీనే అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. అభివృద్ధి సాధించిన పాశ్చాత్య దేశాల్లో కూడా 1988లో ఈ-మెయిల్ అంటే ఎవరికీ తెలీదు. నేను కూడా 1996లోనే మొదటి ఈ-మెయిల్ చేశాను. అలాంటిది మోదీ 1988లోనే ఈమెయిల్ చేశారంటూ ప్రముఖ ఆర్థికవేత్త రూప సుబ్రహ్మణ్య ట్వీట్ చేశారు. ‘మోదీ 1988లోనే ఈమెయిల్ ఉపయోగించారు. చిత్రమేంటంటే ప్రపంచంలో ఎవరూ దాన్ని అప్పటి వరకు ఎరుగరు’ అని ఒకరంటే…’ డ్రైనేజి నుంచి గ్యాస్ తయారు చేసినట్టుగానే మోదీ డిజిటల్ కెమెరాను, ఈమెయిల్‌ను తయారు చేశారు. రాడార్లు చొచ్చుకుపోలేని మేఘాలను కూడా మోదీ కనుక్కొన్నారు. భక్తులకు ఇంకేమైనా అనుమానం ఉందా?’ అంటూ సాహిద్ సిద్ధిఖీ కామెంట్ చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *