మోదీ నివశించిన ధ్యానగుహలో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయని తెలుసా!

మోదీ నివశించిన ధ్యానగుహలో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయని తెలుసా!

సరిగ్గా పోలింగ్ జరగడానికి ఒకరోజు ముందు నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ పర్యటించడం వావాదాస్పదం అయింది. హిమగిరి ప్రజల ‘పహారీ’ సాంప్రదాయ దుస్తులను ధరించి.. మంచుకొండల మధ్య ఉన్న ఒక చిన్నగుహలో ధ్యానం చేయడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రధాని స్థాయి వ్యక్తి గుహలో ఉండటమేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. వాస్తవానికి అది సాధారణ గుహ కాదు. అన్ని రకాల సదుపాయాలు కలిగిన లగ్జరీ గుహ.

గుహలో లగ్జరీ ఏముంటుందని మీకు అనుమానం కలగవచ్చు. గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ (జీఎంవీఎన్) 2018లో ఈ గుహను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. కేదార్‌నాథ్‌ పర్యటించే భక్తులు ఏకాగ్రతతో ధ్యానం చేసేందుకు వీలుగా ఈ గుహలో ఇన్ని సదుపాయాలు కల్పించారు. ఇందులో బస చేయాలంటే భక్తులు రోజుకు రూ.990 చెల్లించాలి. ఇంతకు ముందు ఈ గుహలో ఉండటానికి రూ.3 వేలు చెల్లించాల్సి వచ్చేది. పైగా, మూడు రోజులపాటు ఈ గుహలోనే బస చేయాలనే నిబంధన ఉండేది. దీంతో పర్యాటకులు ఈ గుహలో ఉండేందుకు ఆసక్తి చూపించలేదు. ఈ నేపథ్యంలో జీఎంవీఎన్ ఈ మధ్యనే ఈ గుహ అద్దెను రూ.990కు తగ్గించింది. తప్పనిసరిగా మూడు రోజులు బస చేయాలనే నిబంధన కూడా తీసేసింది.

నిజానికి ఇది పేరుకు మాత్రమే గుహ. లోపలివైపంతా హోటల్ తరహాలోనే ఇందులో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. విద్యుత్, తాగునీటి సదుపాయాలతోపాటు టాయిలెట్ కూడా ఉంది. అలాగే, ఇందులో బస చేసేవారి బాగోగులు చూసుకునేందుకు 24X7 అటెండర్ అందుబాటులో ఉంటాడు. అల్పాహారం, మధ్యాహ్నభోహనం, రాత్రికి మళ్లీ భోజనం అందిస్తాడు. రోజుకు రెండుసార్లు టీ ఇస్తాడు. అటెండర్‌ను పిలిచేందుకు ఇందులో ప్రత్యేకంగా కాలింగ్ బెల్‌ కూడా ఉంటుందండోయ్..!

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *