పంటతెగుళ్లను నివారించే కొత్త పద్ధతి!

పంటతెగుళ్లను నివారించే కొత్త పద్ధతి!

రైతుకు పంట పండించడంలో వచ్చే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒకసారి కరువు వల్ల పంట వేయడమే గగనమైతే, ఇంకోసారి ప్రకృతి వైపరీత్యాలకి పంటనష్టం వాటిల్లి తీవ్రంగా నష్టపోతాడు. ఒకవేళ చచ్చీచెడి పంట పండిస్తే గిట్టుబాటు ధర రాక జీవితాన్ని అంధకారంలో చూసుకుంటాడు. మన దేశంలో వ్యవసాయరంగం మీద ఆధారపడి సగం జనాభా బ్రతుకీడుస్తోంది. ఇవే కాకుండా సహజంగా పంట వేశాక వచ్చే చీడపురుగులను నివారించడం రైతుకున్న అతిపెద్ద సవాలు. ఈ చీడపురుగులను చంపడానికి అక్కడా ఇక్కడా అప్పులు చేసి ఆస్తినంతా పోగోట్టుకుంటాడు. టెక్నాలజీ మారాక కూడా ఇలాంటి సమస్యలుండటం ప్రభుత్వ వైఫల్యమా? అన్నం పెట్టే రైతంటే చిన్న చూపా? అనిపించక మానదు.

కొత్త యాప్…

కానీ, దీనికి పరిష్కారంగా బెర్లిన్, జర్మనీ దేశాలకు చెందిన విద్యార్థులు, శాస్త్రవేత్తలు కలిసి రైతులకు గొప్ప ఊరటను ఇచ్చారు. పంటను కాపాడుకోవడానికి కొత్త యాప్‌ను కనుక్కొని రైతులకు భరోసా ఇచ్చారు. కానీ, దీనికి పరిష్కారంగా బెర్లిన్, జర్మనీ దేశాలకు చెందిన విద్యార్థులు, శాస్త్రవేత్తలు కలిసి రైతులకు గొప్ప ఊరటను ఇచ్చారు. పంటను కాపాడుకోవడానికి కొత్త యాప్‌ను కనుక్కొని రైతులకు భరోసా ఇచ్చారు. 

Plantix app for formers
గుంటూరు జిల్లాకు చెందిన ఓరుగంటి సురేంద్ర వరిని పండించే రైతు. తనకున్న ఎకరం పొలంలో వరిపంటను కాపాడుకోవడానికి ఒక యాప్‌ను వాడుతున్నాడు. సురేంద్రతో పాటు ఆ ఊర్లోని మరికొంతమంది రైతులు కూడా ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఆ యాప్ ద్వారా తమ పంటలకు పట్టిన తెగుళ్లను నిర్మూలిస్తున్నారు. తెగుళ్ల నివారణకు పరిష్కార మార్గాలేమిటో యాప్ ద్వారా తెలుసుకుంటున్నారు. “ఈ యాప్ మాకు చాలా ఉపయోగపడుతోందని, దీన్ని రైతులందరూ వాడుకుంటే బాగుంటుందని ” వారు చెబుతున్నారు. 

రైతులకు, మారుతున్న వాతావరణ పరిస్థితులు తెలియడం ముఖ్యం. పంటలకు సంబంధించిన విషయాలు చేరవేయడం చాలా అవసరం. దీనికోసం భారతదేశంలో రైతుల స్థితిగతుల గురించి చాలా అధ్యయనం చేశాం ” అని చెబుతున్నారు ప్రోగ్రెసివ్ అండ్ అగ్రికల్చరల్ టెక్నాలజీస్(పీట్) కో ఫౌండర్ చార్లోస్ షూమన్. రైతులు పంట వేశాక వాటికి పట్టే చీడను ఫోటోల సాయంతో పోగోట్టడానికి యాప్‌ను కనుక్కోవాలనే ఆలోచన వచ్చింది. వెంటనే ఆ పనులు మొదలుపెట్టి ” ప్లాంటిక్స్ ” అనే యాప్ కనుక్కున్నాం.

తెగుళ్లనే కాదు !

గుంటూరులో జిల్లా బాపట్ల మండలం కర్లపాలెం గ్రామానికి చెందిన రైతు సురేంద్రకు ఈ యాప్ గురించి వివరించాం. ఇంకా ఆ వూర్లో మరో 500 మంది రైతులకు కూడా దీన్ని అందించాం. తెగులు సోకిన పంటల ఫోటోలను తీసి, యాప్‌లో అప్‌లోడ్ చేస్తే…వాటిని విశ్లేషించి దానికి తగిన సలహాని ఈ యాప్ ఇస్తుంది. ” ఈ యాప్ ద్వారా పంటకు పట్టిన చీడనే కాకుండా పండ్లలో పోషక విలువల లోపాన్ని గురించి కూడా తెలుసుకునే ” అంటున్నారు షూమన్. ఈ యాప్ మన దేశంలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు మరో 5 దేశాల్లోని రైతులకు సమాచారాన్ని ఇచ్చి పంటలు నష్టపోకుండా కాపాడుతోంది.

మరో యాప్ కూడా…

ఈ ప్లాంటిక్స్ అనే యాప్ కాకుండా చాలా సంస్థలు రైతుల కోసం యాప్ లను తయారు చేయబోతున్నాయి. ఆఫ్రికాలో సీజీఐఏఆర్ (ఆహార భద్రతపై పరిశోధనలు చేసే సంస్థ) ఇలాంటి యాప్‌ని తయారు చేస్తోంది. ఇది ప్లాంటిక్స్ కన్నా మెరుగైన యాప్ అని ఆ సంస్థ చెబుతోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *