దూసుకొస్తున్న ఫణి తూఫాన్

దూసుకొస్తున్న ఫణి తూఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి ఫణిగా నామకరణం చేశారు.మచిలీపట్నానికి 1460 కిలోమీటర్ల తూర్పు దిశగా తుపాను కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. తీరంవైపు 45 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు వెల్లడించారు.మరో 72 గంటల్లో పెనుతుపానుగా మారే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈనెల 30 నాటికి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముందని తెలిపారు.అదేవిధంగా మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని సూచించారు. తుపాను ప్రభావంతో రాగల 24 గంటల్లో తమిళనాడు, దక్షిణకోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *