మా ఊర్లోకి రావొద్దంటూ ఎంపీ అవినాష్‌రెడ్డిని నిలదీసిన ప్రజలు

మా ఊర్లోకి రావొద్దంటూ ఎంపీ అవినాష్‌రెడ్డిని నిలదీసిన ప్రజలు

ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ప్రజలకు మాట ఇచ్చి గెలిచాక కనబడకుంటే ప్రజలు ఊరుకోవట్లేదు. మళ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చినపుడు కనబడ్డ చోటునే నిలబెట్టి కడిగేస్తున్నారు. తాజాగా జమ్మలమడుగులో ఇలాంటి సంఘటనే జరిగింది. కడప జిల్లాలోని జమ్మలమడుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్‌రెడ్డిలను ఆ ఊరి మహిళలు కడిగిపారేశారు. గత ఎన్నికల్లో గెలిచి కనీసం మా ఊరివైపు కన్నెత్తి చూడకుండా ఇపుడు ఏం మొహం పెట్టుకుని ఓట్ల కోసం వచ్చారంటూ నిలదీశారు. ఐదేళ్లలో ఏనాడైనా మా ఊరికి వచ్చారా? మా ఊర్లోని సమస్యలను గమనించారా? ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఓట్ల కోసం మేము గుర్తొచ్చామా? ప్రశాంతంగా ఉన్న మా గ్రామంలోకి రావద్దు అంటూ ప్రశ్నలతో నిలదీశారు. జమ్మలమడుగు మండలంలోని దేవగుడి, సుగుమంచిపల్లె గ్రామాలకు వెళ్లిన వైసీపీ నేతలను ఊర్లోకి అడుగుపెట్టనివ్వకుండా గ్రామంలోని మహిళలు, పౌరులు అడ్డుకున్నారు.

ప్రజలను శాంతి పరిచే క్రమంలో వైసీపీ నేతలు ‘ మేము రోడ్డుపైనే ఉన్నాము. మీ ఇంటికి రాలేదు’ అని చెప్పడంతో…గ్రామస్థులందరు ఆగ్రహానికి గురయ్యారు. అందరూ ఒక్కటిగా చేరి ఎవరి ఇంటికీ కాదు అసలు గ్రామంలోకే అడుగుపెట్టొద్దని కోప్పడ్డారు. దీంతో ఎలా స్పందించాలో తెలీని నాయకులు మౌనంగా వెనుదిరిగారు. ఆ తర్వాత మరో గ్రామానికి వెళ్లినా ఇదే అనుభవం ఎదురైంది వారికి. ముఖ్యంగా ఎంపీగా గెలిచిన వైఎస్ అవినాష్‌రెడ్డి గెలిచిన తర్వాత ఎంపీ హోదాలో ఎప్పుడూ కూడా మా గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదని, ఇపుడు ఓట్ల కోసం మాత్రం ఇంటింటికి వెళ్లి పలకరిస్తున్నారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.

ఈ సంఘటనలో మరో కోణం కూడా ఉంది. జమ్మలమడుగు ప్రాంతాల్లో ఆదినారాయణ రెడ్డి అంటే ప్రజలు ప్రాణాలు సైతం ఇచ్చేంత నమ్మకం ఉంది. వ్యక్తులతో సంబంధం లేకుండా ఆదినారాయణ ఎవరికి చెప్తే వారికి ఓటు వేసేంత గురి ఉందని అక్కడి స్థానిక ప్రజలు చెబుతారు. అందువల్లే వైసీపీ నేతలను ఆ గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారని తెలుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *