పవన్-చరణ్ మూవీ ఉండబోతుందా..?

పవన్-చరణ్ మూవీ ఉండబోతుందా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకవైపు హీరోగా చేస్తునే మరోవైప్ ప్రొడ్యూసర్‌గా కూడా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్న చరణ్ బాబాయ్‌ పవన్ కళ్యాణ్‌తో కలిసి సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది.టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ పవన్ కళ్యాణ్ … కెరీర్ ఫిక్స్ లో ఉండగానే రాజకీయల్లోకి వెళ్ళిపోయాడు. అయితే రాజకీయా పార్టీ పెట్టిన తరువాత కూడా సినిమాలు చేశాడు. కానీ అవి బాక్సాపీస్ వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ అయిన పవన్ తరువాత సినిమాలు చేస్తాడా లేక కంప్లీట్‌గా టాటా చెబుతాడా అనేది పవన్ ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనా పార్టీ ఓడిపోవడంతో మళ్లీ సినిమాలు చేసే ప్లాన్‌లో ఉన్నాడట. ఇంతకుముందే అడ్వాన్స్‌లు ఇచ్చిన నిర్మాతలతో సినిమాలు చేయబోతున్నాడని టాలీవుడ్ సర్కీల్‌లో వినిపిస్తున్నా మాట. ఆ తరువాత సినిమాలకు బై చెబుతాడని టాక్. అయితే రామ్ చరణ్‌తో వపన్ ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం.

మూడేళ్ళ క్రితం అబ్బాయి రామ్ చ‌ర‌ణ్‌ బాబాయ్‌ పవన్ కాంబినేష‌న్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపొంద‌నుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కాని కొన్నాళ్ళుగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎలాంటి న్యూస్ రాక‌పోవ‌డంతో, అభిమానులు సైలెంట్ అయ్యారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ మ‌రోసారి వార్త‌ల‌లోకి వ‌చ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న మిత్రుడు త్రివిక్ర‌మ్‌కు చరణ్‌ కోసం మంచి క‌థ‌ని రెడీ చేయ‌మ‌ని చెప్పాడట‌.ఈ చిత్రాన్ని ప‌వ‌న్ త‌న సొంత బేన‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్‌పై రూపొందించ‌బోతున్నాడని తెలుస్తోంది. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు.త్రివిక్ర‌మ్.. బ‌న్నీతో మూవీ చేస్తున్నాడు. ఆ తరవాత చరణ్‌తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *