రేపటి నుంచి పార్లమెంట్‌...నేడు అఖిలపక్షం

రేపటి నుంచి పార్లమెంట్‌...నేడు అఖిలపక్షం

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ అఖిలపక్ష భేటీ జరగనుంది. మోడీ రెండోసారి ప్రధాని అయ్యాక తొలి అఖిలపక్ష భేటీ ఇదే. రేపట్నుంచి జూలై 26వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.ఈ భేటీకి వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి.. టీఆర్ఎస్ నుంచి కేశవరావు, నామ నాగేశ్వరరావు.. టీడీపీ నుంచి గల్లా జయదేవ్,రామ్మోహన్ నాయుడు హాజరుకానున్నారు. ఇక.. పార్లమెంట్‌ సమావేశాల మొదటి రెండు రోజులు లోక్‌సభలో సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. 19న స్పీకర ఎన్నిక జరగనుంది. 20న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసగిస్తారు. జూలై 5న కేంద్ర బడ్జెట్‌ను మోడీ సర్కార్ ప్రవేశపెట్టనుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *