ఐటీ రిటర్న్‌కు పాన్‌కార్డ్ అవసరంలేదు...పన్నుదారులకు ఊరట

ఐటీ రిటర్న్‌కు పాన్‌కార్డ్ అవసరంలేదు...పన్నుదారులకు ఊరట

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పదేళ్ల విజన్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల దిశగా వడివడిగా అడుగులేస్తుందన్న సీతారామన్.. ఆర్థిక పురోగతిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌లో మార్పులు చేశారు. ఇప్పటివరకూ ఉన్న ఆదాయపన్ను పరిమితిని అలాగే ఉంచిన కేంద్ర సర్కారు.. ఐటీ రిటర్నులను సమర్పించడానికి పాన్ కార్డ్ అవసరం లేదని వెల్లడించారు. ఇప్పటి వరకూ పాన్ కార్డ్ ఉంటేనే ఐటీ రిటర్నులను సమర్పించడానికి అవకాశం ఉండేది.

గతంలో పన్ను చెల్లింపుదారులు ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేయాలంటే తమ ఆధార్‌, పాన్‌ కార్టులను తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాల్సిందేనని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు కూడా కేంద్రానికి మద్దతుగా ఆధార్, పాన్ అనుసంధానం తప్పనిసరని తీర్పునిచ్చింది. ఆధార్‌ కార్డులో ఒకలా పేరుండి, పాన్‌కార్డులో మరోలా పేరున్న వారికి ఈ నిర్ణయం అప్పట్లో చుక్కలు చూపించింది. ప్రస్తుత బడ్జెట్‌లో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో.. ఈ కష్టాలన్నీ పోనున్నాయి. పాన్ కార్డు బదులుగా ఆధార్ కార్డును కూడా ఐటీ రిటర్నుల ధాఖలుకు ఉపయోగించవచ్చు. పాన్ కార్డు లేని వారు సింపుల్‌గా ఆధార్ నంబర్ ఇచ్చి ఐటీ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. ఇప్పటివరకూ దేశంలో 120 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. వీరిలో ఐటీ శ్లాబ్‌లోకి వచ్చేవారు.. పాన్‌ వినియోగం లేకుండా తేలిగ్గా ఐటీ రిటర్నులు సమర్పించవచ్చు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *