భారత్-పాక్ మ్యాచ్..అభినందన్‌పై పాక్ టీవీ...

భారత్-పాక్ మ్యాచ్..అభినందన్‌పై పాక్ టీవీ...

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌‌కు ఉండే క్రేజ్ వేరు. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. ఇరు దేశాలతో పాటు ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్‌ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. టోర్నీలో భాగంగా ఇరు జట్లు జూన్‌ 16న తలపడనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన జాజ్ టీవీ ఓ యాడ్‌ను విడుదల చేసింది. వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ సంఘ‌ట‌న‌ను వ్యంగ్యంగా చూపుతూ రూపొందించింది. ఇది వివాదస్పదమైంది. దీనికి కౌంటర్‌గా మరో వీడియోను కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్ దళాలను తప్పికొట్టే ప్రయత్నంలో భార‌త్ వైమానిక ద‌ళానికి చెందిన అభినంద‌న్ పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో కిందపడిపోగా… అక్కడి స్థానికులు అతడిని పాక్ దళాలకు అప్పగించారు. శత్రుచెరలో ఉన్న సమయంలో తొలుత అభినందన్‌ను గాయపరిచినట్లున్న వీడియోలు వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. దీంతో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే పనిలో భాగంగా పాక్ ఆర్మీ సిబ్బంది వింగ్ కమాండర్ అభినందన్‌కు సపర్యలు చేసినట్లుగా వీడియో తీశారు. ఎటువంటి భ‌యం లేకుండా టీ తాగుతూ పాక్ అధికారుల ప్రశ్నలకు బదులిచ్చాడు. రెండు రోజులపాటు పాకిస్థాన్ చెరలో ఉన్న అభినందన్ ధైర్యసాహసాలను ప్రదర్శించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. మార్చి 1న పాక్ ఆయనను భారత్‌కు తిరిగి అప్పగించారు.

ఈ నేపథ్యంలో అభినందన్ టీ తాగుతున్న ఘటన ఆధారంగా పాకిస్థాన్‌కు చెందిన జాజ్ టీవీ ఛాన‌ల్ ఓ యాడ్‌ను రూపొందించింది. అందులో అచ్చం అభినంద‌న్‌లాగే ఉన్న ఓ వ్యక్తి టీమిండియా జెర్సీని ధరించాడు. టాస్ గెలిస్తే ఏం చేస్తారని ఆ వ్యక్తిని అడిగితే.. ఐయామ్ సారీ నేనేమీ చెప్పకూడ‌దంటాడు.ఈ ప్రకటనపై భారతీయులు ఫైర్ అవుతున్నారు. వింగ్ కమాండర్ ని అలా చూపించడం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి సంఘటలను ప్రకటనల కోసం వాడుకోవడం మంచిది కాదని హితవు పలుకుతున్నారు. పాకిస్తాన్‌కు ఘాటుగా బదులిస్తూ ఓ క్రీడా ప్రేమికుడు మరో వీడియోను అప్‌లోడ్‌ చేశారు. క్రీడలకు – రాజకీయాలను ముడిపెట్టడం సరికాదన్నారు.

మొత్తానికి మ్యాచ్‌కు ముందే… భారత్‌ – పాకిస్తాన్‌ అభిమానుల మధ్య మాటల యుద్ధం తీవ్ర తరం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి ఇండో – పాక్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *