94 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం

94 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ పోరాటం ముగిసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకొని 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. కానీ.. న్యూజిలాండ్‌కే మెరుగైన రన్‌రేట్‌ ఉండటంతో పాకిస్థాన్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ 44.1 ఓవర్లలో 221 పరుగులకే ఆలౌటైంది.

చెప్పాలంటే ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇప్పటికే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నాయి. ఇక మిగిలింది.. న్యూజిలాండ్, పాకిస్తాన్. అయితే.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో పాక్‌ 94 పరుగుల తేడాతో బంగ్లాను ఓడించింది. కానీ.. పాకిస్థాన్‌ కన్నా మెరుగైనా రన్‌రేట్‌ న్యూజిలాండ్‌కే ఉండటంతో పాకిస్థాన్‌ కథ లీగ్‌ దశలోనే సమాప్తమయింది. దీంతో న్యూజిలాండ్‌కు సెమీ ఫైనల్‌ బెర్త్‌ కన్ఫమ్‌ అయిపోయింది.

ఇక ఈసారి వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ నాలుగు జట్ల సెమీ ఫైనల్ బెర్త్ కన్ఫమ్ అయినప్పటికీ.. ఇండియా, ఆస్ట్రేలియాకు లీగ్ దశలో మరో మ్యాచ్ ఉంది. భారత్‌కు శ్రీలంకతో మ్యాచ్ ఉండగా… ఆస్ట్రేలియాకు సౌత్ ఆఫ్రికాతో ఉంది. ఈ మ్యాచులో భారత్ ఓడిపోయినా కూడా రెండో ప్లేస్‌లోనే ఉంటుంది. సెమీ ఫైనల్‌లో అప్పుడు భారత్.. ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ.. ఆస్ట్రేలియా.. సౌత్ ఆఫ్రికాపై ఓడిపోయినా.. భారత్ శ్రీలంకపై గెలిచినా… భారత్ టాప్ ప్లేస్‌లోకి వెళ్లి.. న్యూజిలాండ్‌తో సెమీఫైనల్ ఆడుతుంది.

ఇక సెమీ ఫైనల్ మొదటి మ్యాచ్.. మాంచెస్టర్‌లో వచ్చే మంగళవారం జరగనుంది. టాప్ ప్లేస్‌లో ఉన్న టీమ్, నాలుగో ప్లేస్‌లో ఉన్న టీమ్‌తో మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్.. వచ్చే గురువారం బర్మింగ్‌హామ్‌ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో రెండో ప్లేస్, మూడో ప్లేస్‌లో ఉన్న టీమ్‌తో తలపడనుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *