యుద్ధం మొదలైతే అది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు: ఇమ్రాన్‌ ఖాన్‌

యుద్ధం మొదలైతే అది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు: ఇమ్రాన్‌ ఖాన్‌
భారత్ మిగ్ 21 బైసన్ విమానం పైలట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మీకి చిక్కాడు. అభినందన్ తమకు చిక్కాడని పాక్ కూడా చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అతనిని పాకిస్తాన్ హింసించినట్లుగా వీడియోలో కనిపిస్తున్నాయి. ఇక అభినందన్ ముఖమంతా గాయాలతో ఉన్నప్పటికీ కెమెరా ముందు అతను మాట్లాడిన తీరు పట్ల భారతీయులు మరింత గర్విస్తున్నారు. ఎంతో నిబ్బరంగా, నిదానంగా తనను బంధించిన వారికి సమాధానం ఇచ్చారు.

సూటిగా…

తాను ఎవరు, తన సర్వీస్‌ నంబరు, అలాగే తన మతమేంటో వెల్లడించారు అభినందన్. ఆ తర్వాత ఓ గొంతు మరిన్ని వివరాలు కావాలని డిమాండ్ చేసింది. దానికి అభినందన్ మాత్రం.. క్షమించండి, ఇంతవరకు మాత్రమే చెప్పగలనని సూటిగా చెప్పేశారు. అలాగే అభినందన్.. తాను పాకిస్థాన్ ఆర్మీ వద్ద ఉన్నానా? అని మర్యాదగా అడిగారు. దానికి అటునుంచి సమాధానం రాలేదు.

నిరాకరించారు

తొలుత పైలట్‌ను పాక్‌ స్థానికులు విపరీతంగా కొడుతున్నట్లు ఉన్న వీడియో బయటకు వచ్చింది. ఆ తర్వాత బయటకు వచ్చిన ఈ వీడియోలో అభినందన్ టీ తాగుతూ విచారణ చేస్తున్న అధికారులకు సమాధానమిస్తున్నట్లుగా ఉంది. ఇందులో పైలట్‌ అక్కడి వాళ్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు నిరాకరించారు. కేవలం ఆయన ఐడీ నెంబరు, పేరును మాత్రమే బయటపెట్టినట్లు ఆ వీడియోలో ఉంది. ఇందులో పైలట్‌ ముఖమంతా ఉబ్చిపోయి ఉంది. ఎదురుగా శత్రు సైనికులు ఉన్నా ఎలాంటి భయం లేకుండా అభినందన్‌ సమాధానం ఇచ్చారు. ఇక అభినందన్‌ను బంధించడం పట్ల భారత్‌ విదేశాంగశాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది

చర్చలకు సిద్ధమని

ఇదిలా ఉండగా అంతకుముందే పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌తో చర్చలకు సిద్ధమని పిలుపునిచ్చారు. కలిసి కూర్చుని మాట్లాడి సమస్యను పరిష్కరించుకుందామన్నారు. శాంతియుత వాతావరణంలో చర్చించుకుంటే మంచిదన్న ఆయన… సహనం కోల్పోతే పరిస్థితులు మరోలా ఉంటాయని బెదిరింపులకు కూడా దిగారు.. యుద్ధం మొదలైతే.. అది ఎక్కడికి దారి తీస్తుందో తెలియదని ఇమ్రాన్‌ ఖాన్‌ వెల్లడించారు. అప్పుడు ఇక పరిస్థితులు మోడీ అదుపులోగాని.. నా అదుపులోగాని ఉండవన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *