అతి నిద్రతో ప్రాణానికి ముప్పు

అతి నిద్రతో ప్రాణానికి ముప్పు

జననమరణాలతో పాటు అత్యంత సహజాతిసహజమైనది నిద్ర. సరైన ఆరోగ్యం ఉండాలంటే కచ్ఛితంగా సరిపడా నిద్రపోయే తీరాలి. ఏయే వయసుల వారు ఎంతసేపు నిద్రపోవాలనే దానికి కొన్ని లెక్కలున్నాయి. వీటిని పాటించకపోతే భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పసిపిల్లలు 18 నుంచి 20 గంటల సేపూ, స్కూల్ పిల్లలు 10 గంటల పాటూ, 20 ఏళ్లు దాటిన వాళ్లు 8 గంటల పాటూ నిద్రపోవాలని… ఎప్పుడో చిన్నప్పుడే మన పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. నిద్రకు సంబంధించన ఒక తాజా సర్వే చాలా మందినే భయపెడుతోంది. దీనిపై ఓ లుక్కేద్దాం పదండి.

అతి నిద్రతో ముప్పు…

నిద్రపోవాల్సిన కనీస సమయంపై చాలా మందికి అవగాహన ఉంది కానీ, ఎక్కువ సేపు నిద్రపోతే వచ్చే ప్రమాదాలపై దృష్టి పెట్టరు. ఎక్కువగా నిద్రపోతే చేజేతాలారా ప్రాణానికి హాని తలపెట్టుకున్నట్లేనని డాక్టర్లు చెప్తున్నారు. అమెరికన్ ఆర్ట్ అసోసియేషన్ తాజాగా…20 ఏళ్ల వయసు దాటిన వారిపై ఒక పరిశోధన చేసింది. దీనిలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ పరిశోధన ప్రకారం రోజుకు 10 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోతున్న వారిలో… 30శాతం మంది సగటు జీవితకాలం కంటే ముందే చనిపోతున్నట్లు తేలింది. అలా ఎక్కువసేపు నిద్రిస్తున్న వారిలో 49శాతం మందికి గుండె సంబంధి వ్యాధులు వచ్చే అవకాశం ఉందనీ, 56శాతం మంది గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందనీ తేలింది. అతి నిద్రకు చెక్‌ పెట్టకపోతే ఏరికోరి కష్టాలను తెచ్చుకున్నట్టేనని ఈ అసోసియేషన్‌ హెచ్చరిస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *