ఒప్పో R15 ప్రో...తక్కువ బడ్జెట్‌లో సూపర్ స్మార్ట్‌ఫోన్

ఒప్పో R15 ప్రో...తక్కువ బడ్జెట్‌లో సూపర్ స్మార్ట్‌ఫోన్

ఒప్పో కొత్త మొబైల్‌తో మార్కెట్‌లో హడావుడి చేయడానికి సిద్ధమైంది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘ఒప్పో’ తన కొత్త మోడల్‌ని తీసుకొచ్చింది. ఒప్పో ‘R15 ప్రో’ అనే పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేసేలాగానే ఉంటుంది. 6.28 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. 6 జీబీ పవర్‌ఫుల్ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో అబ్ధుతంగా ఉంది. దీన్ని 256 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ చేసుకోవచ్చు. 

Oppo R15 Pro

ఈ స్మార్ట్‌ఫోన్‌కు 20, 16 మెగాపిక్సల్ కలిగిన రెండు బ్యాక్‌కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కోసం 20 మెగాపిక్సల్ కెమెరా ఇచ్చారు. పైగా ఫోన్ వెనకభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అమర్చారు. ఈ ఒప్పో R15 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర రూ. 25, 990. అయితే, ఈ ఫోన్ వినియోగదారులకు కావాలంటే అమెజాన్‌లో మాత్రమే దొరుకుతుంది. 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *