అద్దిరిపోయే వన్‌ప్లస్ 7 ప్రొ...లీకైన స్మార్ట్‌ఫోన్ వివరాలు!

అద్దిరిపోయే వన్‌ప్లస్ 7 ప్రొ...లీకైన స్మార్ట్‌ఫోన్ వివరాలు!

రిచ్ సెగ్మెంట్‌లో వచ్చే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్‌కు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. వన్‌ప్లస్ ఇష్టపడే అభిమానులకు ఒక కొత్త శుభవార్త అందింది. వన్‌ప్లస్ 7 ప్రో త్వరలో ఇండియన్ మార్కెట్‌లో సందడి చేయనుంది . ఇప్పటికే ఆన్‌లైన్‌లో మొబైల్‌కి సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. రకరకాల పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. మే 14న అధికారికంగా వన్‌ప్లస్ 7 ప్రో ఇండియాలో గ్రాండ్ రిలీజ్ అవబోతోంది. మూడు వేరియంట్లను కంపెనీ రిలీజ్ చేయబోతోందని అంచనాలున్నాయి. 6జీబీ+128జీబీ మోడల్ ధర రూ.49,999 ఉండొచ్చు. అయితే వన్‌ప్లస్ 7 ప్రో స్పెసిఫికేషన్స్ గురించి కంపెనీ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు. అయితే వన్‌ప్లస్ 7 ప్రో 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుందని మాత్రం తెలిపింది. ఆన్‌లైన్‌లో లీకైన వివరాల ప్రకారం 6జీబీ+128జీబీ ధర రూ.49,999, 8జీబీ+256జీబీ ధర రూ.52,999, 12జీబీ+256జీబీ ధర రూ.57,999 ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంటుందని, 4000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుందని సమాచారం. అంతేకాదు… నెబ్యులా బ్లూ, మిర్రర్ గ్రే కలర్స్‌లో వన్‌ప్లస్ 7 ప్రో వస్తున్నట్టు సమాచారం లీక్ అయింది. మరి ఇందులో నిజమెంతనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ గురించి రకరకాల ప్రచారాలను ఆసక్తిగా గమనిస్తున్న వన్‌ప్లస్ ఫ్యాన్స్… మే 14న బెంగళూరులో జరగబోయే ఈవెంట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అమెజాన్‌లో వన్‌ప్లస్ 7 ప్రో ప్రీ బుకింగ్ మొదలైంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *