కొన్నది రూ.430కి...అమ్మింది 6 కోట్లకు!

కొన్నది రూ.430కి...అమ్మింది 6 కోట్లకు!

ఒక కొత్త నాణ్యమైన వస్తువు కొనాలంటే చాలా ఆలోచిస్తాం. దాని ఖరీదు ఎక్కువేమో…అంత ధరపెట్టి ఎందుకు కొనాలి..ఇలాంటి అనేక అనుమానాలు వస్తూ ఉంటాయి. కానీ కొన్ని పాత వస్తువులకు అలాంటి ప్రశ్న ఉండదు. అవెంత పాతకాలం నాటివైతే అంత ఎక్కువ ధరకు కొనేవారు ఉంటారు. అలాంటి వస్తువులు వేలంపాటలో తరచూ కనబడుతూ ఉంటాయి. ఎంత పాత వస్తువైతే వాటికి అంతెక్కువ సొమ్ము ఇచ్చి కొనుక్కునే ధనవంతులు ఈ ప్రపంచంలో వేలమంది ఉన్నారు. అలాంటి ఒక వస్తువే ఈ మధ్య లండన్‌లో జరిగే వేలంపాటలో వందల రెట్లు ఎక్కువకు అమ్ముడుపోయి అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇంతకూ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం!

వందల సంవత్సరాల పురాతనమైంది…

ప్రాచీన కాలానికి చెందిన ఒక చదరంగం పావు…లండన్‌లో జరిగే వేలంపాటలో ఏకంగా రూ. 6 కోట్లకు అమ్ముడుపోయింది. ఇందులో కొత్తేం ఉందీ…కొన్ని వస్తువులు వందల కోట్లు కూడా పలికాయి అనే అనుమానం వస్తే మీరు చదరంగంలో చేయి పెట్టినట్టే…6 కోట్లకు అమ్ముడుపోయిన ఈ వస్తువుని కొన్న వ్యక్తి దీన్ని ఎంతకు కొన్నాడో చెబితే షాక్ అయిపోతారు. దాదాపు 900 ఏళ్ల క్రితం చేసిన చెస్‌మ్యాన్ పావుని 1964లో ఒక వ్యక్తి కేవలం ఐదు పౌండ్లంకు కొన్నాడు. లండన్‌లోని సౌత్‌బేలో మంగళవారం జరిగిన వేలంపాటలో ఒక వ్యక్తి ఈ పావుని 7.5 లక్షల పౌండ్లకు దక్కించుకున్నాడు. సైనిక యోధుడి ఆకారంలో ఉండే పావు పొడవు 8.8 సెంటీమీటర్లు ఉంటుంది. 12వ శతాబ్దంలో నివశించిన సముద్ర జంతువు దంతంతో ఈ పావుని తయారు చేశారు. నార్సె యోధుల రూపంలో లెవిస్ చెస్‌మ్యాన్ పావులు ఉంటాయి. క్రీ.శ. 800 నుంచి 1066 మధ్యకాలానికి చెందిన ఈ కళాకృతులకు ఎంతో విలువ ఉంది. మార్కెట్‌లో వీటి ధర కూడా ఎక్కువే.

ఇటువంటి చదరంగం పావులు 1830ల కాలంలో స్కాట్లాండ్‌లోని ఇస్లే ఆఫ్ లెవిస్‌లో ఐదు సెట్ల చెస్ పావులు దొరికాయి. అప్పటి నుంచి అనేక చేతులు మారి ఇన్నేళ్లకు లండన్‌లోని వేలంపాటకు చేరాయి. స్కాటిష్ డీలర్ ఒకతను 1964లో ఎడిన్‌బర్గ్‌కు చెందిన డీలర్ తమ నుంచి ఈ చెస్ పావుని రూ. 430 కు కొన్నట్టు స్కాటిష్ డీలర్ మీడియాకు చెప్పాడు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *