గ్రామంలో కలకలం : గులాబీ తోటల క్షుద్ర పూజలు

గ్రామంలో కలకలం : గులాబీ తోటల క్షుద్ర పూజలు

సంగారెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో గులాబి తోట క్షుద్ర పూజలు కలకలం రేపుతుంది. పూల రాజు గులాబీ తోటలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తన పొలంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గులాబీ తోటలో అనుమానాస్పదంగా తిరిగారని బాధితుడు తెలిపాడు.వారిని గమనించి ఇక్కడ ఏమి చేస్తున్నారని నిలధిస్తే.. పూజ కోసం పూలు కొస్తున్నామని చెప్పి వెళ్లి పోయారని, తీరా గమనిస్తే తోటలో క్షుద్ర పూజకు సంబంధించిన సామాగ్రి ఉందన్నాడు రైతు.

క్షద్ర పూజల జరిగినట్లు గుర్తించిన రైతు గ్రామస్థులకు సమాచారం అందించానని తెలిపాడు. విషయం తెలుసుకున్న – బానుర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎవరు క్షుద్ర పూజలు చేశారు? ఎందుకు చేశారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తోన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *