ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటున్న ఎన్టీఆర్ హీరోయిన్

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటున్న ఎన్టీఆర్ హీరోయిన్

ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావనే మాటని పూర్తిగా అబద్దం చేస్తూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్న హీరోయిన్ ఈషా రెబ్బ.ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్న ఈ బ్యూటీ కాస్టింగ్ కౌచ్ పై కొన్ని కామెంట్స్ చేయడమే కాకుండా కాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకోవడానికి కొన్ని టిప్స్ కూడా ఇస్తుంది..మరి ఈషా చెప్తున్నా సలహాలేంటో చూడండి

ప్రస్తుతం మనకు టాలీవుడ్లో ఉన్న తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా మాత్రమే.కెరీర్ స్టార్టింగ్ లో మంచి సినిమాల్లో నటించి హిట్స్ అందుకున్న ఈషా,కెరీర్ ఇప్పుడు బాగా స్లో అయింది.’సుబ్రమణ్యపురం’తర్వాత ఈషాకు చెప్పుకోదగ్గ ఆఫర్లు ఏవీ రాలేదు.ఇదిలా ఉంటె రీసెంట్ గా ఈషా ఒక ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కోచ్ ఇష్యూపై మాట్లాడుతూ,ఇండస్ట్రీలో కాస్టింగ్ గురించి మాట్లాడుతూ…”అన్నీ రంగాలలో ఉన్నట్టే ఫిలిం ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కోచ్ ఉందని క్లారిటీ ఇచ్చేసింది.అయితే ఇన్నేళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న కూడా తనకి అలంటి సిట్యుయేషన్ ఎదురు కాలేదని,ఒకవేళ అలంటి పరిస్థి వస్తుందని తెలిసినా కూడా దాన్ని ఫేస్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతానని చెప్పింది. తనకు ఇబ్బందిగా అనిపించే పరిస్థితులు..మనుషులు ఎదురైతే అక్కడ నుండి తప్పుకుంటానని చెప్పిన ఈషా,పక్కవారికి ఇబ్బంది కలిగించకుండానే ‘నో’చెప్పడం నేర్చుకున్నానని చెప్పిందట.ఈషా చెప్పిన మాటల్లో నిజముంది, కొద్దిగా ఎవరు ఎలాంటి వాళ్ళో గ్రహించి,వాళ్లని ఇబ్బంది పెట్టకుండా,మనం ఇబ్బంది పడకుండా తెలివిగా నో చెప్పి తప్పించుకోవడం తెలిస్తే చాలా ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు.

ఇదిలా ఉంటె కెరీర్ కి బ్రేక్ ఇచ్చే సినిమా కోసం ఎదురు చూస్తున్న ఈషా రెబ్బ,వరసగా ఫోటో షూట్స్ చేసి,తన వంతు ప్రయత్నం చేస్తుంది..కానీ అవకాశాలు మాత్రం రావట్లేదు.వీలైనంత త్వరగా హిట్ పడితేనే ఈషా కెరీర్ బాగుంటుంది,లేదంటే మాత్రం హీరోయిన్ గా లైం లైట్ లో ఉండడం కష్టం.మరి ఈషా ని ట్రాక్ ఎక్కించే ఆ సినిమా ఎదో చూడాలి

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *