మహష్, ఎన్టీఆర్, చరణ్ భారీ మల్టీస్టార్..!

మహష్, ఎన్టీఆర్, చరణ్ భారీ మల్టీస్టార్..!

మహేష్ భరత్ అనే నేను బహిరంగ సభ ఘనంగా ముగుసింది.. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ వస్తారని అందరు అనుకున్నారు. కానీ చివరకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే రావడంతో మెగా అభిమానులు కాస్త నిరాశపడ్డారు. అయితే రామ్ చారణ్ బహిరంగ సభకి రాలేదు కానీ.. ఈ ఈవెంట్ అయ్యాక ఎన్టీఆర్ ని, మహేష్ ని డైరెక్ట్ గా కలిసి పార్టీ చేసుకున్నారు. భరత్ అనే నేను ట్రైలర్ చూసిన రామ్ చరణ్, ట్రైలర్ అదిరిపోయిందని, రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని.. ఈవెంట్ కి రానందుకు సారీ కూడా చెప్పాడు.

మహేష్, ఎన్టీఆర్ తో కలిసి చరణ్ కలిసి చాలా సేపు ముచ్చటించాడట. అందులో rrr గురించి, బోయపాటి సినిమా గురించి కూడా చర్చకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటె ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేష్ అన్నట్లు, మేము మేము బాగానే ఉంటాం, కలిసి ఉండాల్సిందే అభిమానులే అని మహేష్ అన్నట్లు, హీరోలందరి మధ్య హెల్తి కాంపిటిషన్ ఏ ఉంది… మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది.. ఫ్యాన్స్ గొడవలు పడకండి అని చెప్పకనే చెప్తున్నారు. ఇక ఈ ముగ్గురు కలిసిన ఫోటోలోనే ఇంత ఎనర్జీ ఉంటే… ముగ్గురు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందో కదా. మరి దర్శక నిర్మాతలు ఆ సైడ్ కొంచెం అలోచించి.. ముగ్గురిని ఒక సీన్ లో సెట్ చేయండి. బాక్సాఫీస్ లో నాన్-బాహుబలి అనే పదమే వినపడకుండా చేస్తారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *