ఎన్టీఆర్‌ - కొమరం భీమ్‌ ,రామ్‌చరణ్‌ - అల్లూరి సీతా రామరాజు

ఎన్టీఆర్‌ - కొమరం భీమ్‌ ,రామ్‌చరణ్‌ - అల్లూరి సీతా రామరాజు

టాలీవుడ్‌ జక్కన రాజమౌళీ ఇప్పుడు ఏం చేస్తున్నా ప్రపంచం మొత్తం అతడి వైపు చూస్తుంది. అతిని పేరును తెలుగు సినిమా అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. బాహుబలిని చూసిన తర్వాత జక్కన్నపైన అపారమైన నమ్మకాన్ని ఇంకాస్త పెంచుకున్నారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రమూ తగ్గకుండా ఈ సారికూడా రాజమౌళీ సరికొత్తగా రానున్నాడు. అందుకోసమే టాలీవుడ్‌ అగ్రనటులు ఎన్టీఆర్‌నూ, రామ్‌ చరణ్‌నూ ఎంచుకున్నాడు. నందమూరి, మెగా ఫ్యామిలీల మల్టీస్లార్ చిత్రమవ్వడమూ దీనికి మరింత బలంగా మారింది. ఆర్‌ఆర్‌ఆర్‌ వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా మొదలైనప్పటి నుంచీ దీని గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్‌ విషయాలు బయటికి వస్తున్నాయి. తారక్‌, చెర్రీలు ఏయే పాత్రల్లో కనిపించబోతున్నారనే విషయం బయటికి వచ్చేసింది. ఈ వార్తను విన్న ప్రేక్షకులు షాక్‌ అవ్వడంతో పాటు ఆనందంలో మునిగిపోయారు. సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. టాలీవుడ్‌ జక్కన రాజమౌళీ ఇప్పుడు ఏం చేస్తున్నా ప్రపంచం మొత్తం అతడి వైపు చూస్తుంది. అతిని పేరును తెలుగు సినిమా అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. బాహుబలిని చూసిన తర్వాత జక్కన్నపైన అపారమైన నమ్మకాన్ని ఇంకాస్త పెంచుకున్నారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రమూ తగ్గకుండా ఈ సారికూడా రాజమౌళీ సరికొత్తగా రానున్నాడు. అందుకోసమే టాలీవుడ్‌ అగ్రనటులు ఎన్టీఆర్‌నూ, రామ్‌ చరణ్‌నూ ఎంచుకున్నాడు. నందమూరి, మెగా ఫ్యామిలీల మల్టీస్లార్ చిత్రమవ్వడమూ దీనికి మరింత బలంగా మారింది. ఆర్‌ఆర్‌ఆర్‌ వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా మొదలైనప్పటి నుంచీ దీని గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్‌ విషయాలు బయటికి వస్తున్నాయి. తారక్‌, చెర్రీలు ఏయే పాత్రల్లో కనిపించబోతున్నారనే విషయం బయటికి వచ్చేసింది. ఈ వార్తను విన్న ప్రేక్షకులు షాక్‌ అవ్వడంతో పాటు ఆనందంలో మునిగిపోయారు. సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు.

అలా…అలా…

బాహుబలితో ప్రపంచానికి తెలుగు సినిమా అంటే ఏంటో చెప్పిన జక్కన్న మరోసారి టాలీవుడ్‌ చప్పుడుని లోకానికి వినిపించబోతున్నాడు. హిస్టారికల్‌ ఫిక్షన్‌తో మాయచేసేందుకు దాదాపు సిద్ధమైపోయాడు. ఆర్‌ఆర్‌ఆర్ వర్కింగ్‌ టైటిల్‌తో వస్తోన్న చెర్రీ, తారక్‌ల మల్టీస్టార్ చిత్రంలో ఎవరు ఏయే పాత్రల్లో కనిపిస్తారనే క్లారిటీ వచ్చేసింది. తారక్‌ కొమరం భీమ్‌ పాత్రలో, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో అలరించనున్నారు. చరిత్ర ప్రకారం వీరిద్దరూ ఎక్కడా కలిసిన ఆధారాలు లేవు. జక్కన్న మాయాజాలంలో మాత్రం కొమరం భీమ్‌, సీతారామరాజులు కలవనున్నారు. అందుకే ఇది హిస్టారికల్‌ ఫిక్షన్‌ అని చెప్పేశాడు. చేగువేరా మోటార్‌ సైకిల్‌ యాత్ర లాంటి కథనంతో దీన్ని నడిపిస్తున్నాడనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే మరోసారి రాజమౌళీ చరిత్ర సృష్టించబోతున్నాడని ఇండస్ట్రీ మాట్లాడుకుంటోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *