సినిమాలు చూసి చెడిపోయిన కిమ్...అధికారులను చేపలకు ఆహారంగా వేశాడు!

సినిమాలు చూసి చెడిపోయిన కిమ్...అధికారులను చేపలకు ఆహారంగా వేశాడు!

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ గురించి చాలామందికి తెలిసిందే…గతంలో తాను చేయించుకున్నట్టే దేశంలోని యువకుల హెయిర్‌స్టైల్ ఉండాలని నిభందన విధించిన ఈ రాచరిక రాజు గురించి తాజాగా మరో వార్త బయటికి వచ్చింది. కిమ్ కిరాతకం గురించి ఇంటర్నేషనల్ వార్తా పత్రిక ఈ మధ్యనే ఒక కథనం ప్రచురించింది. వియత్నాంలో అమెరికా, ఉత్తర కొరియా మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు విఫలం అవడాన్ని బాధ్యులుగా చూపుతూ ఐదుగురు అధికారులను ఉత్తర కొరియా శిక్షించిందని వార్తలో పేర్కొంది. ఈ ఐదుగురు అధికారుల్లో అమెరికా రాయబారి కిమ్ హ్యోక్ చోల్ కూడా ఉన్నట్టు తెలిపింది.

చర్చలు విఫలమయ్యాయని…
కిమ్ వారిని అత్యంత కిరాతకంగా చంపినట్లు ఆ పత్రిక తెలిపింది. అధికారులకు శిక్ష విధించడం కోసం కిమ్.. బ్రెజిల్ నుంచి ప్రత్యేకంగా ఫిరాన్హా అనే రాకాసి చేపలను వందల సంఖ్యలో ఉత్తర కొరియాకు దిగుమతి చేసుకున్నాడట. వాటిని ప్రత్యేకమైన ట్యాంకుల్లో పెంచుతున్నాడు. అమెరికాతో చర్చలు విఫలమైన అనంతరం కిమ్ తన ముఖ్య అనుచరుల, జనరల్ స్థాయి అధికారుల చేతులను నరికించాడు. తర్వాత బతికుండగానే వారిని ఫిరాన్హా చేపలకు ఆహారంగా వేశాడు. ఉత్తర కొరియాకు సంబంధించిన సమాచారాన్ని అమెరికాకు రహస్యంగా చేరవేసిన కారణంగానే ఆ అధికారులకు కౄరంగా శిక్ష విధించాలని కిమ్ ఆదేశించారని తెలిసింది.

సినిమాలు చూసి చెడిపోయిన కిమ్!
ఈ ఉదంతంలో మరో ఆసక్తికరమైన సమాచారం బయటకు పొక్కింది. 1977లో విడుదలైన జేమ్స్ బాండ్ సినిమా ‘ద స్పై హు లవ్స్ మీ’ స్ఫూర్తితో కిమ్ ఈ చేపలను కొనుగోలు చేశారని చెబుతున్నారు. ఆ సినిమాలో విలన్ కర్ల్ స్ట్రామ్‌బర్గ్ తన శత్రువులను షార్కు చేపలతో నిండివున్న అక్వేరియంలో పడేసి దారుణంగా చంపేస్తాడు. ఆ సన్నివేశం కిమ్‌కు బాగా నచ్చడంతో ఫిరాన్హా చేపలను పెంచుతున్నాడని తెలిసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *