పిజ్జా తినొద్దందని... అమ్మని చంపేశాడు

పిజ్జా తినొద్దందని... అమ్మని చంపేశాడు

కొన్నికొన్ని సంఘటనలు ఆలోచనలో పడేస్తాయి. చుట్టూ ఉన్న సమాజాన్ని చూపించి బాధపెడుతూ, భయపెడతాయి. జాగ్రత్తపడమని హెచ్చరిస్తాయి. మారుతోన్న మనిషితత్వంలోని కోణాలను ఎత్తిచూపుతాయి. చేసుకోవాల్సిన మార్పులను పదేపదే గుర్తుచేస్తాయి. ఇదీ అలాంటి సంఘటనే. ఈ తరంలోని కొందరి టీనేజ్‌ పిల్లల పట్టరాని కోపాన్నీ, ఆ కోపంలో చేసిన దిద్దుకోలేని తప్పులనూ మన ముందుంచింది.

boy killed her mother for pizza

మూడేళ్ల క్రితం…

అది అమెరికాలోని నార్గ్ కరోలోనా రాష్ర్టం. 2015 నవంబర్‌లో తేలుప్రోలు నళిని (51) హత్యకుగురైంది. ఆ సమయంలో భర్త ఇంట్లో లేడు. కొడుకు అర్నవ్‌ మాత్రమే ఉన్నాడు. పోలీసులకు అతని మీదే అనుమానం వచ్చింది. కానీ అతడి వయసు పదహారేళ్లే కావడంతో అప్పుడు అరెస్టు చేయలేదు. మూడేళ్ల పాటు దర్యాప్తును కొనసాగించారు. గత ఏడాది నుంచీ అభియోగాలు నమోదు చేశారు. కోర్టులో శుక్రవారం హాజరుపరిచారు. జడ్జి ఎదుట తన తప్పును ఒప్పుకున్నాడు.

పిజ్జా వద్దందని…

తల్లిని తానే చంపానని ఒప్పుకున్న అర్నవ్‌ ఆ కారణాన్నీ బయటపెట్టాడు. చదువుని పక్కన పెట్టి సరదాలకూ, షికార్లకూ ఉత్సాహం చూపుతున్న అతడికి తనని తల్లి కట్టడి చేయడం నచ్చలేదు. క్రమక్రమంగా కోపం పెంచుకున్నాడు. హత్య జరిగిన రోజున నళిని భర్త వేరే ప్రదేశంలో ఉన్నాడు. అదే రోజున అర్నవ్‌ పిజ్జా ఆర్డర్‌ చేశాడు. ఎప్పటినుండే జంక్‌ ఫుడ్ తగ్గించమని మొత్తుకుంటున్న తల్లికి కోపమొచ్చింది. పిజ్జా విషయంలో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. అర్నవ్‌ ఎంతకీ వినకపోవడంతో చెంప చెల్లుమనిపించింది. దాంతో అర్నవ్‌ పట్టరాని కోపంతో ఊగిపోతూ, తల్లిని గొంతు నులుమి చంపేశాడు. ఈ కేసులో అతడికి 12 ఏళ్ల వరకూ శిక్షపడే అవకాశాలున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *