నోకియా అద్దిరిపోయే ఆఫర్!

నోకియా అద్దిరిపోయే ఆఫర్!

నోకియా స్మార్ట్‌ఫోన్ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది.హెచ్ఎండీ గ్లోబల్ తన నోకియా స్మార్ట్‌ఫోన్లపై వినియోగదారులను ఆకట్టుకునే ఆఫర్‌లను అందిస్తోంది. దీనికోసం ‘నోకియా ఫోన్స్ ఫ్యాన్ ఫెస్టివల్’ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ మే 24 వరకు అందుబాటులో ఉంటుంది.

ఈ సేల్‌లో భాగంగా నోకియా 8.1…4 జీబీ ర్యామ్ వేరియంట్‌పై రూ.6,000 వరకు తగ్గింపు పొందవచ్చు. దీని కోసం ఫ్యాన్6000 ప్రోమోకోడ్‌ను ఉపయోగించాలి. నోకియా 8.1…6 జీబీ ర్యామ్ వేరియంట్‌పై రూ.4,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే నోకియా 7.1, నోకియా 6.1 ప్లస్, నోకియా 8 సిరొక్కో ఫోన్‌లపై రూ.1,000 తగ్గింపు అందుబాటులో ఉంది. దీని కోసం ఫ్యాన్‌ఫెస్టివల్ అనే ప్రోమోకోడ్‌ను ఉపయోగించాలి.

మరోవైపు హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ తన నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లపై పరిమిత కాల ధరతగ్గింపు ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. నోకియా 6.1 ప్లస్… 4 జీబీ ర్యామ్ వేరియంట్, నోకియా 5.1 ప్లస్… 3 జీబీ ర్యామ్ వేరియంట్‌పై రూ.1,750 ప్రమోషనల్ డిస్కౌంట్ కూడా ఉంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *