నోకియా 106 రీఎంట్రీ !

నోకియా 106 రీఎంట్రీ !

ఫీచర్ ఫోన్‌లు గుర్తున్నాయా మీకు…స్మార్ట్‌ఫోన్‌లు రాకముందు అందరి చేతుల్లో ఆభరణంలా వెలిగాయి. ఈ ఫీచర్ ఫోన్‌లలో కింగ్‌లా ఏకఛత్రాధిపత్యంలా ఏలిన నోకియా స్మార్ట్‌ఫోన్‌లు రాగానే చతికిలబడింది. స్మార్ట్‌ఫోన్‌లోనూ తన ప్రతిభ చూపించాలని ప్రయత్నించి బ్యాటరీ కాల్చుకుంది. అలాంటి నోకియ తమ పాత నోకియా 106 మోడల్‌ని మళ్లీ మన ముందుకు తెస్తోంది. 2013 లో వచ్చిన ఈ మోడల్‌ని 2018 వినియోగదారుల కోసం మళ్లీ విడుదల చేసింది.

nokia 106 features and cost

క్లాసిక్ స్నేక్ గేమ్…

ఈ కొత్త మోడల్‌లో అదనంగా కొన్ని కొత్త ఫీచర్స్‌ని కూడా జతచేసింది. ఈ కొత్త ఫోన్ 1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 800 ఎమేహెచ్ బ్యాటారీ ఉంది. ఫీచర్ ఫోన్ వాడిన వారి క్లాసిక్ స్నేక్ గేమ్ కూడా కొత్త వినియోగదారుల మళ్లీ పునరావృతం చేసింది. ఇంకా…ఈ ఫోన్‌లో 2 వేల నంబర్లను ఫీడ్ చేసుకోవచ్చు.500 మెసేజ్‌లను స్టోరేజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం డార్క్ గ్రే కలర్‌లో నోకియా 106(2018) లభిస్తుంది. దీని ధర రూ. 1299 తక్కువకే తీసుకొచ్చారు.

 మరిన్ని ఫీచర్ల …

1.8 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉన్న ఈ ఫోన్, 160 X 128 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ కలిగి ఉంది. 800 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 ఎంబీ ర్యాంతో ఎఫ్‌ఎం రేడియో, నేటివ్ గేమ్స్, ఫ్లాష్ లైట్, మైక్రో యూఎస్‌బీ కనెక్టర్, 15.7 గంటల టాక్‌టైంతో పాటు 21 రోజుల స్టాండ్ బై టైం ఉంటుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *