అచ్చం జయలలితలా నిత్యామేనన్‌

అచ్చం జయలలితలా నిత్యామేనన్‌

జయలలితకు ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. తమిళనాడంతా ప్రేమగా అమ్మ అని పిలుచుకుంటుంది. అంచెలంచెలుగా ఎదిగి శిఖరమంతై నిలిచిన పవర్‌ఫుల్ ఉమెన్‌గా జయలలితను ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. అంతటి ఫాలోయింగ్, ప్రజాదరణ ఉన్న జయలలిత బయోపిక్‌ వస్తుందంటే… అంచనాలు ఆకాశమంత ఉంటాయి. ఆ బయోపిక్‌ గురించి కొన్ని ఇంట్రస్టింగ్‌ విశేషాలు బయటికొచ్చాయి. వాటిపై ఓ లుక్కేద్దాం పదండి.

ప్రియదర్శిని మీద అందరి కళ్లూ…

జయలలిత బయోపిక్‌ను తెరకెక్కిచేందుకు ఇద్దరు దర్శకులు పోటీపడుతున్నారు. ఇద్దరూ సినిమాకు కావాల్సిన అన్ని సన్నాహాలనూ పూర్తి చేసుకుని పట్టాలెక్కించారు. ‘మదరాస పట్టణం’ ఫేమ్‌ విజయ్‌, ప్రియదర్శినీ ఈ ఇద్దరు దర్శకులూ బయోపిక్‌ పనిలోనే ఉన్నా, అందరి దృష్టీ ప్రియదర్శిని సినిమా మీదే ఉంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది.

Jayalalitha biopic updates

ఒదిగిపోయిన నిత్యా…

ప్రియదర్శని దర్శకత్వం వహిస్తోన్న సినిమాకు ‘ది ఐరన్‌ లేడీ’ టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ పేరే ఎంతోమందికి తెగ నచ్చేసింది. దీనికి తోడు జయలలిత వర్థంతిని పురస్కరించుకుని విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది. జయలలిత పాత్రలో కనిపించబోతున్న నిత్యామేనన్‌ అచ్చుగుద్దినట్టు అలానే ఉంది. ఈ సినిమాలో జయలలిత సినీ, రాజకీయ రంగాల్లోని ప్రముఖఘట్టాలనూ, విశేషాలనూ ముఖ్యంగా చూపనున్నట్టు తెలుస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *